News December 5, 2025
రాజమండ్రిలో నిలిచిన విమాన సర్వీసులు

పైలట్ల సమ్మె కారణంగా మధురపూడి విమానాశ్రయంలో సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. గురువారం హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, 3.30 గంటలకు రావాల్సిన విమానాలు రద్దయ్యాయి. దీంతో ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన రిటర్న్ సర్వీసులను అధికారులు నిలిపివేశారు. అలాగే దిల్లీ, హైదరాబాద్ నుంచి రావాల్సిన పలు సర్వీసులు సుమారు 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Similar News
News March 12, 2026
దేవరపల్లి: లారీ ఢీకొని రిటైర్డ్ వ్యవసాయాధికారి మృతి

దేవరపల్లి మండలం కృష్ణంపాలెం జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గాంధీనగరం గ్రామానికి చెందిన రిటైర్డ్ వ్యవసాయ శాఖ AD ఆచంట జగన్నాథరావు ప్రయాణిస్తున్న స్కూటీని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు. దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గాంధీనగరంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
News March 12, 2026
రాజమండ్రిలో అక్రమాల డొంక లాగుతున్న ACB

రాజమండ్రి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో రెండు రోజులుగా ACB అధికారులు చేపట్టిన తనిఖీలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు, అనధికార లేఅవుట్లపై ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ బృందం లోతుగా దర్యాప్తు చేస్తోంది. కార్యాలయంలోని సుమారు 700 పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన అధికారులు, పలు కీలక పత్రాలను సీజ్ చేశారు. గురువారం నగరవ్యాప్తంగా ACB బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు నిర్వహించనుంది.
News March 10, 2026
రాజమండ్రిలో HPV వ్యాక్సినేషన్ పోస్టర్ ఆవిష్కరణ

గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14 ఏళ్ల బాలికలకు ఒక డోసు HPV వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు జేసీ వై.మేఘా స్వరూప్ తెలిపారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ వ్యాక్సినేషన్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాయని, విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో దీనిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.


