News April 19, 2024

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

image

TG: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. నిన్న ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ, రేపు సూర్యతాపం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగాడ్పులు వీస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వృద్ధులు, చిన్నారులు, రోగులు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు నిన్న వడదెబ్బకు గురై రాష్ట్రంలో ఐదుగురు మరణించారు.

Similar News

News January 20, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

రిటైర్మెంట్ ప్రకటించిన సైనా నెహ్వాల్

image

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కాంపిటేటివ్ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ‘నేను రెండేళ్ల క్రితమే ఆడటం ఆపేశాను. నా ఇష్టంతోనే ఈ ఆటలోకి వచ్చాను. ఇష్టపూర్వకంగానే తప్పుకున్నాను. దీనిని ప్రత్యేకంగా అనౌన్స్ చేయాల్సిన అవసరంలేదు’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. వరల్డ్ మాజీ నం.1 బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన సైనా నెహ్వాల్ ఒలింపిక్ బ్రాంజ్ మెడల్ సహా మొత్తం 24 అంతర్జాతీయ పతకాలను సాధించారు.