News December 5, 2025
MBNR: విద్యార్థికి వేధింపులు.. ఇద్దరు సస్పెండ్

జడ్చర్ల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థిని వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపల్ రజిని రాగమాల, వైస్ ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మిని సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థిని వేధింపులకు పాల్పడిన సంఘటన ఉమ్మడి జిల్లాలో గురువారం సంచలనంగా మారింది. DSP వెంకటేశ్వర్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Similar News
News December 8, 2025
డెయిరీఫామ్‌తో నెలకు రూ.1.25 లక్షల ఆదాయం

స్త్రీలు కూడా డెయిరీఫామ్ రంగంలో రాణిస్తారని నిరూపిస్తున్నారు హిమాచల్‌ప్రదేశ్‌లోని తుంగల్ లోయకు చెందిన సకీనా ఠాకూర్. పీజీ పూర్తి చేసిన ఈ యువతి కుటుంబం వద్దన్నా ఈ రంగంలో అడుగుపెట్టారు. తన ఫామ్‌లో ఉన్న 14 హెచ్‌ఎఫ్ ఆవుల నుంచి రోజూ 112 లీటర్ల పాలను విక్రయిస్తూ.. నెలకు రూ.1.25 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు. సకీనా సక్సెస్ వెనుక కారణాలను తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.
News December 8, 2025
పెద్దపల్లి: 23 ఏళ్ల తర్వాత మళ్లీ అవకాశం!

ఒకప్పటి అసెంబ్లీ నియోజకవర్గమైన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామంలో సర్పంచ్ పదవికి 23ఏళ్ల తర్వాత మళ్లీ BCలకు అవకాశం లభించింది. 2002లో సర్పంచ్ పదవి BC(జనరల్) అభ్యర్థికి కేటాయించగా మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన సాన రాజలింగయ్య గెలుపొందారు. తిరిగి సైతం BC(జనరల్)కు రిజర్వు కావడంతో ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరు రిటైర్డ్ టీచర్ కాగా, నలుగురు యువకులు ఉన్నారు.
News December 8, 2025
DRDO CFEESలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

DRDO అనుబంధ సంస్థ సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్& ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (CFEES)లో 38 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరుతేదీ. టెన్త్, ఇంటర్, ITI ఉత్తీర్ణులై, 18- 27ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. ముందుగా ncvtmis.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టైపెండ్ నెలకు రూ.9600 చెల్లిస్తారు. https://www.drdo.gov.in/


