News December 5, 2025

సాకారం దిశగా మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్

image

మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌కు లైన్ క్లియర్ అవుతోంది. MP వల్లభనేని బాలశౌరి కృషి ఫలిస్తోంది. మచిలీపట్నం-రేపల్లెకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్నది దశాబ్దాల నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. 45 KM మేర రైల్వే లైన్ ఏర్పాటుకు DPR తయారీకి ఫీల్డ్ సర్వే పనులు జరుగుతున్నాయని పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Similar News

News March 21, 2026

కృష్ణా: జేసీ హెచ్చరిక

image

జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ శుక్రవారం హెచ్చరించారు. జిల్లాలో ఎటువంటి గ్యాస్ సిలిండర్ల కొరత లేదన్నారు. ప్రజల్లో నెలకొన్న అలజడి కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ (08672-252493) ఏర్పాటు చేశామన్నారు.

News March 19, 2026

కృష్ణా జిల్లాలో ధాన్యం సేకరణ రికార్డు.. రూ. 1,744 కోట్ల చెల్లింపులు!

image

కృష్ణా జిల్లాలో 2025-26 ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియ దిగ్విజయంగా పూర్తయినట్లు జాయింట్ కలెక్టర్ నవీన్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 92,639 మంది రైతుల నుంచి మొత్తం 7.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. దీని విలువ రూ. 1,744.50 కోట్లుగా ఉంది. రైతు సేవా కేంద్రాల ద్వారా పారదర్శకంగా కొనుగోళ్లు జరిపామని, అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

News March 18, 2026

కృష్ణా: పదో తరగతి హిందీ పరీక్షకు 233 మంది గైర్హాజరు

image

పదో తరగతి హిందీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 21,312 మంది విద్యార్థులకు గాను 21,079 మంది పరీక్షకు హాజరయ్యారు. 233 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ వర్గాలు తెలిపాయి. DLO 4, DEO 7, ACGE 5, డిస్ట్రిక్ట్ మోనటరింగ్ కో-ఆర్డినేటర్స్ 5, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ 45 కేంద్రాలను తనిఖీ చేశాయి. ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి 598 మందికి 437 మంది హాజరయ్యారని తెలిపారు.