News December 5, 2025
‘విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలి’

విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ పిలుపునిచ్చారు. కేంద్రీయ విద్యాలయం వార్షిక ఆటల పోటీలు 2025-26 కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ హాజరయ్యారు. ఆమెకు స్కౌట్స్ అండ్ గైడ్స్ స్వాగతం పలికింది. ఆటల పోటీల జెండాను ఆవిష్కరించి ప్రోగ్రాంను ప్రారంభించారు. విద్యార్థుల నృత్యాలు, ప్రదర్శనలు అలరించాయి.
Similar News
News December 6, 2025
ఒక కాకి చనిపోతే మిగిలినవి ఎందుకు వస్తాయో తెలుసా?

సాధారణంగా ఒక కాకి చనిపోతే మిగిలినవి దాని చుట్టూ చేరి అరుస్తూ ఉంటాయి. కాకుల గుంపు కాకి మృతికి గల కారణాన్ని గమనించి.. ఆ ప్రాంతంలో ఉన్న ప్రమాదాన్ని అంచనా వేస్తాయి. ప్రమాదకరమైన మనిషి లేదా ప్రదేశాన్ని గుర్తుంచుకుని భవిష్యత్తులో జాగ్రత్త పడతాయి. సింపుల్‌గా చెప్పాలంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాయి. ఈ విధంగా తమ వంశాన్ని రక్షించుకుంటాయి. కాకి వస్తే ఎవరో చనిపోతారనేది మూఢనమ్మకం అని పరిశోధనలు చెబుతున్నాయి.
News December 6, 2025
WGL: మూడో విడతలో 16,866 నామినేషన్లు!

ఉమ్మడి జిల్లాలో 3వ విడత నామినేషన్లు ముగిసేసరికి సర్పంచ్‌కు 4,098, వార్డులకు 12,768 కలిపి 16,866 నామినేషన్లు దాఖలయ్యాయి. MHBD 169 సర్పంచ్ స్థానాలకు 1,185, 1412 వార్డులకు 3592, జనగామ 91 జీపీలకు 688, 800 వార్డులకు 1961, ములుగు 46 జీపీలకు 242, 408 వార్డులకు 950, HNK 68 జీపీలకు 514,634 వార్డులకు 1822, WGL 109 జీపీలకు 783, 946 వార్డులకు 2639, BHPL 81 జీపీలకు 686, 696 వార్డులకు 1,804 నామినేషన్లు వచ్చాయి.
News December 6, 2025
భద్రాద్రి: 3వ విడతలో అందిన నామినేషన్ల వివరాలు

మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో చివరి రోజు నాటికి అందిన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల వివరాలను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ వెల్లడించారు. వివరాలిలా.. ఆళ్లపల్లి – 63, 234, గుండాల – 70, 271, జూలూరుపాడు – 124, 452, లక్ష్మీదేవిపల్లి – 164, 661, సుజాతనగర్ – 79, 271, టేకులపల్లి – 244, 685, ఇల్లందు – 196, 680, మొత్తం సర్పంచ్ – 940, వార్డు మెంబర్లు – 3254 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.


