News April 19, 2024

మానేర్ డ్యామ్‌లో దూకిన వ్యక్తి

image

ఎల్ఎండీ మానేరు డ్యామ్‌లో దూకిన యువకుడిని లేక్ పోలీసులు రక్షించారు. శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు గురువారం మానేరు డ్యామ్ నీటిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా గస్తీ కాస్తున్న పోలీసులు నీటిలో దూకి తనని రక్షించి కౌన్సిలింగ్ ఇచ్చి అతని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ఆ యువకుడు తెలియజేశారు.

Similar News

News January 16, 2026

KNR: కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు

image

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి క్యాంప్ కార్యాలయంలో గురువారం సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. పల్లె సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో అలంకరించగా, సిబ్బంది పండుగ వాతావరణంలో పాల్గొన్నారు.

News January 16, 2026

KNR: మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల పోస్టర్‌ ఆవిష్కరణ

image

కరీంనగర్ జిల్లా మైనారిటీ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల పోస్టర్‌ను అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆవిష్కరించారు. 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంతో పాటు 6, 7, 8 తరగతుల్లోని మిగులు సీట్ల కోసం FEB 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలోని 9 సంస్థల్లో ఉత్తమ బోధనతో పాటు IIT/NEET శిక్షణ ఇస్తారన్నారు.పూర్తి వివరాలకు www.tgmreistelangan.cgg.gov.in సంప్రదించాలన్నారు

News January 16, 2026

KNR: ఎన్నికల నగారా.. టికెట్ వేటలో ఆశావహులు

image

మున్సిపల్ ఎన్నికల వేళ కరీంనగర్‌లో రాజకీయ సందడి మొదలైంది. కేంద్రమంత్రి, రాష్ట్రమంత్రి, స్థానిక ఎమ్మెల్యేల ప్రాతినిధ్యంతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో టికెట్ ఆశావహుల తాకిడి పెరిగింది. అధిష్ఠానం దృష్టిలో పడేందుకు తమ గళాన్ని వినిపిస్తూ, ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.