News December 5, 2025

VZM: కోర్టు కాంప్లెక్సుల్లో వాష్‌రూమ్‌ల నిర్వహణకు టెండర్లు

image

జిల్లాలోని వివిధ కోర్టు కాంప్లెక్సుల్లో 178 వాష్‌ రూమ్‌ల వార్షిక శుభ్రత నిర్వహణకు సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత శుక్రవారం తెలిపారు. 18 మంది క్లీనింగ్ సిబ్బందితో ఈ కాంట్రాక్ట్ ఏడాది కాలం అమలులో ఉంటుందని, ఆసక్తి గల అర్హులైన వారు తమ కొటేషన్లను ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, విజయనగరానికి సమర్పించాలని కోరారు.

Similar News

News March 5, 2026

VZM: మిషన్ హార్టీ విజన్‌తో ఉద్యాన సాగు విస్తరణ

image

జిల్లాలో మిషన్ హార్టీ విజన్ అమలు ద్వారా ఉద్యాన పంటల సాగును విస్తరించి రైతులకు నిరంతర ఆదాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విషయాన్ని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో అదనంగా 6 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

News March 5, 2026

వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి: VZM DMHO

image

వేసవి నేపథ్యంలో వడదెబ్బ నుంచి రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జీవన రాణి సూచించారు. విజయనగరంలోని తన కార్యాలయం ఆమె మాట్లాడారు. ఎండ తీవ్రతతో శరీర ఉష్ణోగ్రత అధికమై ప్రాణాపాయం కలగొచ్చని హెచ్చరించారు. చెమట పట్టకపోవడం, మగత, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఎండలో తిరగకూడదని, తగినంత నీరు తాగాలన్నారు.

News March 4, 2026

VZM: ‘రీసర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి’

image

జిల్లాలో జరుగుతున్న రీ సర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సిసిఎల్ఏ జి.జయలక్ష్మితో అమరావతి నుంచి బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. రీసర్వే ప్రక్రియలో ఎక్కడా జాప్యం జరగకూడదని, గడువులోగా రీసర్వేతో పాటు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.