News December 5, 2025
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. సీఎంలకు మంత్రుల ఆహ్వానం

TG: ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వ్యాపారవేత్తలతో పాటు పలు రాష్ట్రాల CMలకూ మంత్రులు ఆహ్వానం పలుకుతున్నారు. ఇవాళ AP CM చంద్రబాబును కోమటిరెడ్డి, TN CM స్టాలిన్‌ను ఉత్తమ్, ఝార్ఖండ్ CM హేమంత్‌ను భట్టి ఆహ్వానించారు. ‘CBN సీనియర్ నాయకుడు. ఆయన సలహా తీసుకుంటాం. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలి’ అని కోమటిరెడ్డి చెప్పారు.
Similar News
News March 7, 2026
సుందర్ పిచాయ్ జీతం రూ.6,361 కోట్లు!

గూగుల్ CEO సుందర్ పిచాయ్ శాలరీ ప్యాకేజీ భారీగా పెరిగింది. వచ్చే మూడేళ్ల కాలానికి $692 మిలియన్ల(రూ.6,361 కోట్లు)ను అందుకోనున్నారు. ఇందులో వార్షిక జీతం, రిస్ట్రిక్టెడ్ స్టాక్ వెస్టింగ్, అనుబంధ సంస్థల్లో షేర్ల వాటా కలిసి ఉంటుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్యాకేజీ తీసుకుంటున్న సీఈవోలలో ఒకరుగా నిలిచారని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. కాగా 2004లో గూగుల్‌లో చేరిన సుందర్ 2015లో సీఈవో అయ్యారు.
News March 7, 2026
సెంటిమెంట్.. హోటల్‌ను మార్చిన టీమ్ఇండియా

T20 WC విజేతగా నిలిచేందుకు టీమ్ఇండియా ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని దృష్టిలో ఉంచుకొని, సెంటిమెంట్ పరంగా ఆ టైమ్‌లో బస చేసిన ITC నర్మదలో కాకుండా తాజ్ స్కై లైన్‌కు బస మార్చేసింది. అహ్మదాబాద్‌లో రేపు న్యూజిలాండ్‌తో ఫైనల్ జరగనుండగా చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకుంది. అటు ఇటీవల చంద్రగ్రహణం టైమ్‌లోనూ జట్టు ప్రాక్టీస్‌కు ఆలస్యంగా వచ్చిన విషయం తెలిసిందే.
News March 7, 2026
సర్కారు బడి పిల్లలకు గుడ్ న్యూస్.. వారానికో రోజు ఫిష్!

TG: ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు మరింత పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రస్తుతం ఇస్తున్న చికెన్ స్థానంలో వారానికి ఒకరోజు చేపలను చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ కొత్త మెనూ అమలు చేసే అవకాశం ఉంది. ఒక వారం చికెన్, మరో వారం చేపలు అందించేలా ప్రత్యామ్నాయ మార్గాలనూ అధికారులు పరిశీలిస్తున్నారు.


