News December 5, 2025
JGL: 941మంది సర్పంచ్ స్థానాలకు పోటీ

జగిత్యాల జిల్లాలో ఈనెల 14న జరిగే 2 విడత ఎన్నికల్లో జరిగే 7మండలాల్లో మొత్తం 144 సర్పంచ్, 1276 వార్డు స్థానాలు ఉన్నాయి. అయితే నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 144 సర్పంచి స్థానాలకు గాను, మొత్తం 941 మంది, అలాగే 1276 వార్డు స్థానాలకు గాను, మొత్తం 2927 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరంతా ఈనెల 14న జరిగే 2వ విడత ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Similar News
News December 6, 2025
క్రికెటర్ శ్రీచరణి తండ్రికి రూ.5 లక్షల చెక్కు అందజేత

కడప క్రికెట్ తేజం నల్లపురెడ్డి శ్రీచరణికి జిల్లా TDP అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వ్యక్తిగతంగా ప్రకటించిన రూ.5 లక్షల ప్రోత్సాహక చెక్కును శనివారం MLA మాధవి, క్రికెట్ స్టేడియం ఛైర్మన్ శ్రావణ్ రాజ్‌రెడ్డి కలిసి ఆమె తండ్రికి అందజేశారు. మహిళా క్రికెట్ వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి కడపకు గర్వకారణమై నిలిచిన శ్రీచరణిని అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
News December 6, 2025
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 షెడ్యూల్

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్-2047 ఎల్లుండి ప్రారంభం కానుంది. హైదరాబాద్ శివారులోని ఫ్యూచర్ సిటీలో విశాలమైన ప్రాంగణంలో ఈ సదస్సు జరగనుంది. వివిధ దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ నేతలు, దేశంలోని కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు హాజరవనున్నారు. సమ్మిట్ రెండు రోజుల షెడ్యూల్‌ను ఇక్కడ <
News December 6, 2025
TU: డిగ్రీ పరీక్షలు..149 మంది గైర్హాజరు

తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా కొనసాగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 29 పరీక్ష కేంద్రాల్లో ఉదయం జరిగిన ఐదో సెమిస్టర్ రెగ్యులర్, ఆరో సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 1,931 మంది విద్యార్థులకు గాను 1,782 మంది విద్యార్థులు హాజరు కాగా 149 మంది గైర్హాజరయ్యారు.


