News December 5, 2025
FEB 8 నుంచి శ్రీశైల బ్రహ్మోత్సవాలు

AP: నంద్యాల(D)లోని శ్రీశైల మల్లన్న ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. లక్షలాది మంది భక్తులు రానుండటంతో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని EO శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. క్యూలు, మంచినీరు, అటవీ ప్రాంతంలో నడకదారి భక్తులకు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. FEB 15న పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం, 16న స్వామి అమ్మవార్ల రథోత్సవం ఘనంగా నిర్వహించాలన్నారు.
Similar News
News March 7, 2026
విటమిన్ల కోసం వీటిని తీసుకోండి!

శరీర ఎదుగుదలకు, రోగనిరోధక శక్తికి విటమిన్లు అత్యవసరం. క్యారెట్లు, లివర్‌లో విటమిన్ A ఉంటుంది. B1- తృణధాన్యాలు, చిక్కుళ్లు. B2- పాలు, గుడ్లు, పాలకూర. B3 – చికెన్, వేరుశెనగ. B5- అవకాడో, గుడ్లు. B6- అరటిపండు, సాల్మన్ ఫిష్. B7- గుడ్లు, బాదం, కాలీఫ్లవర్. B12- చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు. D – సూర్యకాంతి, చేపలు, పాలు. K- కాలే, బ్రోకలీ, సోయాబీన్స్. E- సన్‌ఫ్లవర్ సీడ్స్, బాదం. C -నారింజ, జామ. SHARE IT
News March 7, 2026
విజయ్‌కి భార్య షాక్.. కోర్టులో మరో పిటిషన్!

టీవీకే అధినేత విజయ్‌కి ఆయన భార్య సంగీత <<19295692>>మరోసారి<<>> షాక్ ఇచ్చారు. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఆమె మరో పిటిషన్ దాఖలు చేశారు. తమ విడాకుల కేసు ముగిసే వరకు తాను విజయ్ ఇంట్లోనే ఉండేందుకు అనుమతివ్వాలని అందులో కోరారు. ‘చెన్నై నీలంకరైలోని ఇంట్లో నాకూ సగం వాటా ఉంది. విడాకుల కేసు ముగిసే వరకు, నేను వేరే ఇంటికి మారే వరకు అక్కడ ఉండేందుకు అనుమతించాలి’ అని తన పిటిషన్‌లో కోరినట్లు తెలుస్తోంది.
News March 7, 2026
సుప్రీంలీడర్‌ను ఇరాన్ కావాలనే ప్రకటించట్లేదా?

ఇరాన్ సుప్రీంలీడర్‌గా ఖమేనీ కొడుకు మొజ్తాబాను నియమించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే వాటిలో <<19297127>>నిజం లేదని<<>> అక్కడి ప్రభుత్వం చెప్పింది. ఈ క్రమంలో సుప్రీంలీడర్ నియామకంపై ఇరాన్ కావాలనే ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొజ్తాబాను ప్రకటిస్తే చంపేస్తారనే భయంతో సైలెంట్‌గా ఉన్నట్లు సమాచారం. ఎవరిని ఎన్నుకున్నా అంతం చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించడం, కొత్తగా <<19290160>>బాధ్యతలు చేపట్టిన<<>> పలువురిని చంపడం తెలిసిందే.


