News December 5, 2025

సిద్దిపేట: ఉమిద్ పోర్టల్‌లో ఆస్తుల నమోదు

image

ఉమిద్ పోర్టల్‌లో ఎండోమెంట్ ఆస్తుల నమోదును ప్రక్రియ సిద్దిపేట జిల్లా జమియత్ ఉలేమా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఉమిద్ పోర్టల్‌పై నెల రోజుల నుంచి సిద్ధిపేట అధ్యక్షుడు ముఫ్తీ అబ్దుల్ సలాం ఖాస్మి చుట్టుపక్కల మండలాల ప్రజల్లో అవగాహన కల్పించారు. జిల్లాలోని పలు మండలాల యువత, నాయకులు తమ వద్ద ఉన్న వక్ఫ్ ఆస్తి పత్రాలను పోర్టల్‌లో నమోదు చేశారు.

Similar News

News March 8, 2026

రాష్ట్రపతి ఘటన: మమత సర్కార్‌పై కిషన్ రెడ్డి ఫైర్

image

బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రపతి <<19322594>>ద్రౌపదీ ముర్ము<<>> పట్ల వ్యవహరించిన తీరు దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సంతాళీ తెగ సమ్మేళనాన్ని ఉద్దేశపూర్వకంగానే ఆ జనాభా తక్కువ ఉన్న చోట నిర్వహించడం, కనీస ప్రొటోకాల్ పాటించకుండా CM మమతా బెనర్జీ గైర్హాజరు కావడం గిరిజన జాతులను అవమానించడమేనని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వారిని రాజకీయాల్లోకి లాగడం ఏమాత్రం సరికాదని ధ్వజమెత్తారు.

News March 8, 2026

వాల్మికిపురం: స్కూటర్ ఢీకొని తల్లి మృతి.. బిడ్డకు సీరియస్

image

స్కూటర్ ఢీకొని తల్లి మృతి చెందడంతో ఆమె కుమారుడు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. శనివారం రాత్రి వాల్మీకిపురం మండలంలో జరిగిన ఘటనపై ఎస్సై తిప్పేస్వామి వివరించారు. గుర్రంకొండ మండలం రామాపురంకి చెందిన మురళి భార్య రెడ్డిలక్ష్మి ఆమె కుమారుడు బాలాజీ బైకులో సొంతపనిపై చింతపర్తికి వచ్చారు. పనిముగించుకుని తిరిగి స్వగ్రామానికి బైకులో వెళుతుండగా.. వాల్మీకిపురం బైపాస్‌లో స్కూటర్ ఢీకొని తల్లి మృతి చెందింది.

News March 8, 2026

మహిళా దినోత్సవ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. కుడా కార్యాలయంలో జరిగిన సమీక్షలో మహిళా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ స్టాల్స్ ఏర్పాటు, వేదిక తదితర ఏర్పాట్లు సమన్వయంతో చేయాలని పేర్కొన్నారు.