News December 6, 2025

ఎర్రవల్లి: వచ్చేది మన ప్రభుత్వమే: కేసీఆర్

image

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్రవల్లి, నర్సన్నపేట సర్పంచి అభ్యర్థులు ఆయన్ను కలిశారు. వచ్చేది మన ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని, కొన్ని కష్టాలు వచ్చినా బెదరకూడదని అన్నారు. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎవరో ఏదో చేస్తారని ఆగం కావొద్దని సూచించారు.

Similar News

News March 10, 2026

కాసేపట్లో కదిరి తేరు..

image

అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం నేడు అశేష భక్తజన సందోహం మధ్య జరగనుంది. ఉ.8:25 నుంచి 8:45 మధ్య శుభ మేష లగ్నంలో <<19334160>>రథం<<>> కదలనుందని వేదపండితులు తెలిపారు. భక్తజన సందోహం మధ్య గోవింద నామస్మరణతో కదిరి పురవీధులు మారుమోగనున్నాయి. ఈ వేడుకను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు.

News March 10, 2026

యుద్ధం.. పడిపోతున్న బియ్యం ధరలు

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం వరి రైతులపైనా ప్రభావం చూపుతోంది. చెన్నై పోర్టు నుంచి ఆఫ్రికన్ దేశాలకు బియ్యం ఎగుమతులు ఆగిపోగా, ఇప్పటికే బయల్దేరిన కంటైనర్లూ వెనక్కి వచ్చేశాయి. దీంతో వారం కిందటి వరకు పుట్టి(850KG) ధాన్యం ధర ₹22,500 ఉండగా ప్రస్తుతం ₹21Kకు పడిపోయింది. ఇంకొన్ని రోజులు ఎక్స్‌పోర్ట్స్ నిలిచిపోతే రేట్లు మరింత పతనం కానున్నాయి. అలాగే $11.8Bn విలువైన ఆహారోత్పత్తుల ఎగుమతులపైనా ప్రభావం పడనుందని అంచనా.

News March 10, 2026

ఫైళ్ల దహనం వెనకున్న ప్లాన్ ఏంటో తేలాలి: సుప్రీంకోర్టు

image

AP: మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన ఫైళ్ల దహనం తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రికార్డు రూమ్‌లో మంటలు ఎలా అంటుకున్నాయి? దాని వెనకున్న ప్లాన్ ఏంటో లోతుగా విచారించాల్సి ఉందని తెలిపింది. ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి సహా ఇతర నిందితుల ముందస్తు బెయిల్‌కు నిరాకరించింది. ఘటన సమయంలో నిందితుడు విదేశాల్లో ఉన్నారనే కారణంతో విచారణ నుంచి తప్పించుకోలేరని పేర్కొంది.