News December 6, 2025
సిద్దిపేట: రూ.16.30 లక్షలకు వేలం.. 35 మందిపై కేసు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 35 మందిపై కేసులు నమోదు చేసినట్లు సిద్దిపేట త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపారు. పాండవపురంలోని దేవాలయం వద్ద కొంతమంది సర్పంచిగా పోటీ చేస్తున్న వారితో చర్చలు జరిపారని గత నెల 29వ తేదీన భైరి శంకర్ రూ.16.30 లక్షలకు వేలం పాడినట్లు ఒప్పుకొన్నారన్నారు. వారికి వ్యతిరేకంగా వేలంలో పాల్గొన్న భైరి రాజు నామినేషన్ వేయడంతో అతన్ని కుల బహిష్కరణ చేద్దామన్ననుకున్నట్లు చెప్పారు.
Similar News
News December 11, 2025
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా నాగరాజు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా నాగరాజును నియమిస్తూ కూటమి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. నాగరాజు జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.
News December 11, 2025
మేడారం సర్పంచ్‌గా భారతి

తాడ్వాయి మండలంలో గురువారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. మండలంలోని మేడారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పీరీల భారతి-వెంకన్న గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి భారతి గెలుపుతో మేడారంలో నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి విజయోత్సవ సంబరాలను జరుపుకుంటున్నారు.
News December 11, 2025
తాడూరు: 2 ఓట్లతో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి

తాడూరు మండలంలోని గుట్టలపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికలు గురువారం జరిగాయి. గ్రామానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి 243 ఓట్లు రాగా.. సమీప కాంగ్రెస్ పార్టీకి చెందిన చిందం అయ్యన్నకు 241 ఓట్లు వచ్చాయి. కేవలం 2 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆయన మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న గుట్టలపల్లి గ్రామం తనను గెలిపించినందుకు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు.


