News December 6, 2025
స్క్రబ్ టైఫస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రజలందరూ స్క్రబ్ టైఫస్ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం వైద్య శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐదు రోజులు పూర్తిగా జ్వరం తగ్గని వారు స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ‘చిగ్గర్ మైట్’ అనే కీటకం కుట్టడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్ వస్తుందన్నారు.
Similar News
News March 31, 2026
శ్రీకాకుళం: బ్యాక్లాగ్ పోస్టుల నియామకానికి దరఖాస్తు ఆహ్వానం

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు గ్రూప్ ఫోర్, క్లాస్ ఫోర్ నియామకాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు దివ్యాంగ శాఖ ఇన్‌ఛార్జ్ పీడీ బొడ్డేపల్లి శైలజ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు నమూనా, కాళీ పోస్టుల వివరాల కోసం www.srikakulam.ap.gov.in వెబ్సైట్‌ను సంప్రదించాలన్నారు. ఏప్రిల్ 14 లోపు నేరుగా, రిజిస్టర్ పోస్టు, కొరియర్‌లో దివ్యాంగ శాఖకు దరఖాస్తులు అందజేయాలన్నారు.
News March 31, 2026
శ్రీకాకుళం: నీటి తొట్టెలు వాడండి..!

వేసవి నేపథ్యంలో పశువులకు తాగునీరు అందించే నీటి తొట్టెలను వినియోగించాలని శ్రీకాకుళం పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కె.రాజగోపాల్ రావు సూచించారు. తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. గతేడాది ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో జిల్లాలోని 30 మండలాల్లో 894 నీటి తొట్టెలను నిర్మించినట్లు చెప్పారు. వీటిని ఉదయాన్నే నీటితో నింపితే పశువులకు దాహార్తి సమస్య ఉండదన్నారు.
News March 31, 2026
శ్రీకాకుళం: పాపం.. ఏ తల్లి కన్నబిడ్డో!

శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. పాతపట్నం మండలం బూరగాంలోని ఓ వీధి పెరట్లో సోమవారం సాయంత్రం పసికందు ఏడుపులు వినిపించాయి. స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా సమీపంలో ఎవరూ లేరు. ఏ తల్లో మగబిడ్డను పడేసి వెళ్లినట్లు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు పిల్లలు లేకపోవడంతో పసికందును చూసుకుంటానని చెప్పడంతో స్థానికులు ఆమెకు అప్పగించారు.


