News December 6, 2025
కారిడార్ భూముల్లో పర్యటించిన పరిశ్రమల శాఖ రాష్ట్ర కార్యదర్శి

నక్కపల్లి మండలంలోని విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ భూములను శుక్రవారం పరిశ్రమలశాఖ రాష్ట్ర కార్యదర్శి యువరాజ్ పరిశీలించారు. త్వరలో ఏర్పాటు కానున్న స్టీల్ ప్లాంట్ ఇతర పరిశ్రమల కోసం ఏపీఐఐసీ చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పరిశీలించారు. సబ్ స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మిట్టల్-నిప్పన్ స్టీల్ ఫ్యాక్టరీకి కేటాయించిన భూములను పరిశీలించారు.
Similar News
News December 6, 2025
PDPL: ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి: సీపీ

రామగుండం CP అంబర్ కిషోర్ ఝా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బపల్లి సర్వేలియన్స్ చెక్‌పోస్ట్‌ను సందర్శించి వాహన తనిఖీలు పరిశీలించారు. ఓటర్లను ప్రలోభపెట్టే నగదు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనంతరం గర్రెపల్లి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి, పటిష్ఠ భద్రత, 24/7 పర్యవేక్షణ అమలు చేయాలని సూచించారు.
News December 6, 2025
సంగారెడ్డి: డీడీఓపీగా శైలజ నియామకం

ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ న్యాయవాది శైలజ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ.. తన నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విధులను అంకితభావంతో నిర్వహిస్తానని తెలిపారు. నూతన డీడీఓపీను పలువురు న్యాయవాదులు అభినందించారు.
News December 6, 2025
ఆఫీస్ తర్వాత నో కాల్స్, ఈమెయిల్స్.. పార్లమెంటులో ప్రైవేట్ బిల్

పని వేళలు పూర్తయ్యాక, సెలవుల్లో ఆఫీస్ ఫోన్ కాల్స్, ఈమెయిళ్లను తిరస్కరించే హక్కు ఉద్యోగులకు కల్పించాలంటూ NCP MP సుప్రియ లోక్‌సభలో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టారు. ఇందుకోసం ఉద్యోగుల సంక్షేమ సంస్థను ఏర్పాటు చేయాలని ‘రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్-2025’లో ప్రతిపాదించారు. కాగా ఏదైనా అంశంపై చట్టం అవసరమని భావిస్తే MPలు బిల్లులను ప్రవేశపెట్టవచ్చు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తే బిల్లులను ఉపసంహరించుకుంటారు.


