News December 6, 2025

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి: ఐజీ ఆకే రవికృష్ణ

image

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఐజీ ఆకే రవికృష్ణ ఆకాంక్షించారు. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల జడ్పీ పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించారు. ఆకే రవికృష్ణ వర్చువల్‌లో పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. ప్రతీ విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకొని, ఆ లక్ష్యసాధన దిశగా ముందుకు వెళ్తే అనుకున్నది సాధించవచ్చన్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుకు సహకరించాలన్నారు.

Similar News

News March 30, 2026

కర్నూల్: పోలీస్ ప్రజా ఫిర్యాదుల వేదికకు 98 వినతులు

image

కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు జిల్లావ్యాప్తంగా 98 వినతులు అందాయి. ఉద్యోగాల పేరిట మోసాలు, ఆర్థిక వివాదాలు, కుటుంబ సమస్యలపై ప్రజలు మొరపెట్టుకున్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

News March 30, 2026

కర్నూల్: పీజీఆర్ఎస్‌లో డీఆర్‌వో వినతుల స్వీకరణ

image

ప్రజల ఫిర్యాదులను నాణ్యతతో, వేగవంతంగా పరిష్కరించాలని డీఆర్‌వో సి.వెంకట నారాయణమ్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల వినతులు స్వీకరించి, పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు. రీ-ఓపెన్ అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.

News March 30, 2026

దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు: కలెక్టర్ సిరి

image

వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు కర్నూలులోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో తాగునీరు, చల్లని మజ్జిగను నిరంతరం అందుబాటులో ఉంచుతామని ఆమె తెలిపారు. వడదెబ్బ నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధాన ప్రాంతాల్లో మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.