News December 6, 2025
బాలిక విన్నపంపై స్పందించిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే

మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో నాల్గో తరగతి బాలిక ఐశ్వర్య తమ ఇంటి పట్టా సమస్యను ఎమ్మెల్యే సురేంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లింది. ఎమ్మెల్యే వెంటనే స్పందించి, తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది, టీడీపీ నాయకులు స్థలాన్ని పరిశీలించారు. ఐశ్వర్య కుటుంబానికి తక్షణమే ఇంటి పట్టా మంజూరు చేశారు. విద్యార్థి కుటుంబసభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 9, 2026
అసాంఘిక పనులకు పాల్పడితే కఠిన చర్యలు: SP

జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంలో సక్రమ ప్రవర్తన ఎంత ముఖ్యమో పోలీసు అధికారులు వారికి అవగాహన కల్పించారు. పాత నేరాలను వదిలిపెట్టి, బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని సూచించారు. ఎవరైనా తిరిగి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా లేదా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News March 8, 2026
1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ‘మీ కోసం’ కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. అర్జీలు పరిష్కారం కాలేదా లేదా స్థితి తెలుసుకోవాలంటే 1100కు కాల్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చన్నారు. ఈ నెల 9న అనంతపురం కలెక్టరేట్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామన్నారు.
News March 8, 2026
ఏప్రిల్ నెలాఖరులోగా పనులను పూర్తిచేయాలి: కలెక్టర్

జిల్లాలోని 20 సబ్‌స్టేషన్లలో జరుగుతున్న పనులను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శింగనమల మండలం పెరవలిలో PM-KUSUM పథకం కింద ఏర్పాటు చేస్తున్న 4 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. రైతులు, మెఘా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు.


