News December 6, 2025

చలికాలంలో ఉదయాన్నే వాకింగ్‌తో నష్టాలే ఎక్కువ!

image

వాకింగ్ శరీరానికి ఎంతో మంచిది. కానీ చలికాలం ఉదయాన్నే చేసే వాకింగ్‌తో లాభంకంటే నష్టాలే ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. ‘చల్లటి గాలి ఊపిరితిత్తులపై ఒత్తిడి తెస్తుంది. BP పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. సడెన్‌గా చలిలోకి వెళ్లడంతో ఇమ్యూనిటీ ప్రభావం పడుతుంది. దాంతో తరచూ జలుబు చేసే ప్రమాదం ఉంటుంది. మంచులో రోడ్డు సరిగ్గా కనిపించక పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది’ అని హెచ్చరిస్తున్నారు.

Similar News

News March 27, 2026

సీతారాముల కళ్యాణంలో తలంబ్రాల విశిష్టత

image

భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో ముత్యాలు కలిపిన, గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. ఈ తలంబ్రాల తయారీలో ఉపయోగించే వరి ధాన్యాన్ని భక్తులు నియమనిష్టలతో పండించి నూర్పిడి చేసి వడ్లుగా మారుస్తారు. వీటిని గోటితో ఒలిచి బియ్యంగా మార్చి భద్రాచలానికి కాలినడకన వచ్చి అందిస్తారు. వీటికి బుక్కా, గులాలు, అత్తరు, పన్నీరు, ఆవునెయ్యిని కలుపుతారు. అందుకే ఈ కల్యాణ తలంబ్రాలు గులాబీ రంగులో ఉంటాయి.

News March 27, 2026

పనస కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

పనస పండ్లను చెట్ల నుంచి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. తొక్కపై కళ్లు పూర్తిగా విచ్చుకొని, లేత పసుపుపచ్చ రంగులోకి మారి వాసన వచ్చే కాయలనే కోయాలి. ఒకసారి కాసిన చోటే మరల కాసే గుణం పనసకు ఉంటుంది. కాబట్టి కాయలను కోసేటప్పుడు కొద్దిగా తొడిమను వదిలి కోయాలి. కోతకు వచ్చిన కాయలను పట్టుకొని గట్టిగా లాగినా, బెరడును గాయపరిచినా కాండం మీద మొగ్గలు దెబ్బతినే అవకాశం ఉంది.

News March 27, 2026

‘వారణాసి’ రిలీజ్‌పై ట్విస్ట్.. రెండు పార్టులుగా?

image

<<19470891>>’వారణాసి’<<>> సినిమా 2 పార్టులుగా విడుదలయ్యే ఛాన్సుందని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీకి 3hrs+ నిడివి సరిపోదని, రెండు పార్టులుగా రిలీజ్ చేస్తే కథను మరింత బాగా చెప్పొచ్చని మూవీ టీమ్ భావిస్తున్నట్లు తెలిపాయి. రెండో పార్ట్ సీక్వెల్‌లా కాకుండా కొనసాగింపుగా ఉంటుందని సమాచారం. అయితే ఈ మూవీని ఒకే పార్ట్‌గా రిలీజ్ చేస్తామని గతంలో రాజమౌళి ప్రకటించినా లేటెస్ట్ బజ్‌పై అఫీషియల్‌గా క్లారిటీ రావాల్సి ఉంది.