News April 19, 2024
Elections2024: ఆసక్తికర విషయాలు

భారత దేశ చరిత్రలో లోక్‌సభ ఎన్నికలు సుధీర్ఘంగా జరగడం ఇది రెండోసారి. ఈదఫా 7 విడతల్లో ఏప్రిల్ 19 నుంచి జూన్ 4 వరకు 44 రోజుల పాటు ఎన్నికలు కొనసాగనున్నాయి. అయితే.. ఇంతకంటే సుదీర్ఘమైన ఎన్నికలు గతంలో జరిగాయి. ఏకంగా 68 విడతల్లో పోలింగ్ నిర్వహించడం విశేషం. 1951 అక్టోబర్ 25న మొదలై 1952 ఫిబ్రవరి 21న ముగిశాయి. ఓటింగ్ ప్రక్రియకు 3 నెలల 27 రోజులు పట్టింది. గత 2019 ఎన్నికలు 39రోజుల్లో ముగిశాయి.
<<-se>>#Elections2024<<>>
Similar News
News September 18, 2025
ఈసీఐఎల్‌లో 160 ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని <
News September 18, 2025
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

APలోని రాయలసీమలో ఒకటి, రెండుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA హెచ్చరించింది. కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలోని HYDలో సాయంత్రం మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది.
News September 18, 2025
‘OG’ టికెట్ ధరల పెంపు.. YCP శ్రేణుల ఫైర్

పవన్ కళ్యాణ్ OG సినిమా <<17742687>>టికెట్<<>> రేట్లను పెంచడంపై వైసీపీ శ్రేణులు ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. బెనెఫిట్ షోకు ఏకంగా రూ.1,000 (జీఎస్టీ కలుపుకుని) ఏంటని ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పుష్ప-2 సినిమా టికెట్ ధరలను సైతం (రూ.800+GST) పెంచిన విషయం గుర్తు లేదా అని పవన్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీ కామెంట్?