News December 6, 2025

మహబూబాబాద్: మూడో విడతలో సర్పంచ్‌కు 1,185 నామినేషన్లు

image

మూడో విడత ఎన్నికల్లో డోర్నకల్, గంగారం కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోల్ మండలాల్లో 169 గ్రామ పంచాయతీల్లో 1,412 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 3వ రోజు నామినేషన్లు ముగిశాయి. సర్పంచ్‌కు 1,185, స్థానాలకు నామినేషన్లు, వార్డు స్థానాలకు 3,592 నామినేషన్‌లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉపసంహరణ, స్క్రూటీని అనంతరం ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News December 6, 2025

GNT: మంత్రి నారా లోకేశ్‌పై అంబటి ట్వీట్

image

మంత్రి నారా లోకేశ్‌పై గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ‘X’లో సెటైరికల్ ట్వీట్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం మంత్రి లోకేశ్ చంద్రబాబు ప్లేటును తీస్తున్న ఓ ఫొటో షేర్ చేసి, ఇప్పుడు నువ్వు “తిన్న ప్లేటు” రేపు నువ్వు “కూర్చున్న సీటు” తీసేయడం కాయం.! అంటూ క్యాప్షన్ ఇచ్చి చంద్రబాబు, లోకేశ్‌లకు ట్యాగ్ చేశారు.

News December 6, 2025

మూడో విడత ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల స్వీకరణ

image

ఖమ్మం జిల్లాలో మూడో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. 7 మండలాల్లోని 191 గ్రామ పంచాయితీలకు గాను మొత్తం 1025 మంది సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఏన్కూరు S-109, కల్లూరు S-124, పెనుబల్లి S-158, సత్తుపల్లి S-106, సింగరేణి S-157, తల్లాడ S-145, వేంసూరు 126 మంది సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేశారు. కాగా నేటి నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరగనుంది.

News December 6, 2025

7వేల కి.మీ పొడవైన నది.. కానీ బ్రిడ్జిలు ఉండవు!

image

ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెజాన్ నదిపై వంతెనలు లేవని మీకు తెలుసా? అవును. ఈ నది బ్రెజిల్, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, బొలివియా, వెనిజులా, గయానా, సురినామ్ దేశాల మీదుగా దాదాపు 7వేల కి.మీ ప్రవహిస్తుంది. దీని వెడల్పు 3-10 కి.మీ ఉంటుంది. వర్షాకాలంలో అది 48 కి.మీ వరకు విస్తరిస్తుంది. లోతు 330 అడుగులకు చేరుతుంది. అంతేకాదు అక్కడి మృదువైన నేలల్లో బ్రిడ్జిలు నిర్మించడం చాలా కష్టం. అందుకే బోట్లలో నది దాటుతారు.