News April 19, 2024

తూ.గో.: వైసీపీ ఎంపీటీసీ దారుణ హత్య

image

తూ.గో. జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధి ఎటపాక మండలం కన్నాయిగూడెం ఎంపీటీసీ వర్ష బాలకృష్ణ గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి ఓ వివాహ కార్యక్రమం చూసుకుని వస్తుండగా, కన్నయ్య గూడెం ఊరి శివారులో ఇద్దరు దారి కాచి బండరాయితో మోది హత్య చేశారు. హత్యానంతరం ఇద్దరు నిందితులు ఎటపాక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 9, 2025

తూ.గో జిల్లా అడహాక్ కమిటీ ఛైర్మన్‌గా మీసాల మాధవరావు

image

ఏపీ ఎన్జీవో సంఘం తూర్పుగోదావరి జిల్లాఅడహాక్ కమిటీ ఛైర్మన్‌గా మీసాల మాధవరావు ఎన్నికయ్యారు. బుధవారం సాయంత్రం రాజమండ్రి రోటరీ హాల్లో నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా సమావేశంలోఅడహాక్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. కో ఛైర్మన్ ప్రవీణ్ కుమార్, కన్వీనర్‌గా అనిల్ కుమార్, ఆర్థిక సభ్యుడిగా సత్యనారాయణ రాజు, సభ్యులుగా వెంకటేశ్వరరావు, నందీశ్వరుడు, ఎస్ వెంకటరమణ ఎన్నికయ్యారు.

News October 9, 2025

ఆఫ్రికా నత్తల నిర్మూలనకు చర్యలు చేపట్టాం: కలెక్టర్

image

తూ.గో జిల్లాలో ఆఫ్రికా నత్తల నిర్మూలనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. బుధవారం రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు కలెక్టరేట్‌లో ఉద్యాన శాఖ పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో సుమారు 176 హెక్టార్లలో ఉద్యాన పంటలపై ఆఫ్రికా నత్తల ప్రభావం ఉన్నట్లు గుర్తించామన్నారు.

News October 8, 2025

బాణసంచా తయారీకి అనుమతులు తప్పనిసరి: జేసీ

image

జిల్లాలో బాణసంచా తయారీదారులు, విక్రయదారులు రెవెన్యూ అధికారుల వద్ద అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ అన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..బాణసంచా తయారీ కేంద్రాలను రెవెన్యూ, ఫైర్, పోలీస్ అధికారులు బాణాసంచా తయారు కేంద్రాలపై తనిఖీలు చేపట్టాలన్నారు.