News December 6, 2025

జగిత్యాల: ‘ప్రజా భద్రతలో హోం గార్డులది కీలక పాత్ర’

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో 63వ హోం గార్డుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. ట్రాఫిక్, ఎన్నికలు, నైట్ పెట్రోలింగ్, నేర నిరోధం, విపత్తు నిర్వహణలో హోం గార్డుల పాత్ర కీలకమని ఆయన అన్నారు. కళాబృందం అవగాహన కార్యక్రమాలను అభినందించారు. హోం గార్డుల సంక్షేమం కోసం భత్యాల పెంపు, బీమా, రెయిన్ కోట్లు, జాకెట్లు పంపిణీ చేశారు. ఉత్తమ సిబ్బందికి బహుమతులు అందజేశారు.

Similar News

News March 14, 2026

శ్రీగిరిలో ఉగాది కోలాహలం

image

శ్రీశైలం క్షేత్రం ఉగాది ఉత్సవాలకు సిద్ధమైంది. ఈ వేడుకల కోసం కర్ణాటక నుంచి కన్నడ భక్తులు భారీగా తరలివస్తున్నారు. క్షేత్రమంతా భజనలు, నృత్యాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సోమవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పాదయాత్రగా వస్తున్న భక్తుల శివనామస్మరణతో నల్లమల కొండలు మారుమోగుతున్నాయి. భక్తుల రాకతో శ్రీగిరి పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

News March 14, 2026

కర్నూలు: ఇద్దరు బిడ్డలతో కలిసి తల్లి ఆత్మహత్య

image

కర్నూలు మండలం గార్గేయపురం గ్రామ చెరువులో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు రాజేశ్వరి (35), అబ్రహం(3), సుకుమార్ (6)గా గుర్తించారు. భర్తతో మనస్పర్థల కారణంగా రాజేశ్వరి కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటున్నట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈమె పిల్లలతో సహా చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.

News March 14, 2026

మహిళ ఆత్మహత్య వీడియో వైరల్.. స్పందించిన సజ్జనార్

image

కళ్లెదుటే <<19370480>>భార్య ప్రాణాలు<<>> తీసుకుంటుంటే.. అడ్డుకొని కాపాడాల్సిన భర్త హేళన చేస్తూ వీడియో తీయడం అత్యంత విచారకరం. సమాజానికి సిగ్గుచేటని HYD సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ట్వీట్ చేశారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు సహజమని, పంతాలకు పోయి ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయేదాకా కెమెరా పట్టుకుని చోద్యం చూడడం పైశాచికత్వం అని పేర్కొన్నారు. దయచేసి బంధాలకు విలువనివ్వాలని, క్షణికావేశంలో ఇలా చేస్తే ఆపాలన్నారు.