News April 19, 2024
అన్నమయ్య: భర్తను చంపిన భార్య

భార్యే భర్తను చంపిన ఘటన అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలో వెలుగు చూసింది. కోటవూరు(P) చవటకుంటపల్లెకు చెందిన వెంకటరమణ(58) మొదటి భార్యతో విడిపోయాడు. రెండో భార్య రెడ్డెమ్మ, కుమారుడితో ఉంటున్నారు. మద్యం తాగి రోజూ గొడవపడేవాడు. ఈక్రమంలో బుధవారం మద్యం మత్తులో ఉన్న వెంకటరమణ గొంతుకు భార్య చీర బిగించి చంపేసింది. దీనికి కుమారుడు సహకరించినట్లు సమాచారం. CI సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 25, 2025
BREAKING మైదుకూరు: RTC బస్సు నుంచి దూకిన యువతి.!

ఆళ్లగడ్డ- మైదుకూరు RTC బస్సు నుంచి యువతి దూకి గాయపడిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ప్రయాణికుల వివరాల మేరకు.. మైదుకూరు శ్రీరామ్ నగర్‌కు చెందిన ఓ యువతి తన స్టాప్ రాగానే బస్సును ఆపాలని కోరగా డ్రైవర్ ఆపలేదు. దీంతో యువతి ఒక్కసారిగా బస్సు నుంచి దూకి గాయపడింది. కాగా బస్సు డ్రైవర్ బస్సును ఆపి పరారైనట్లు సమాచారం. ఘటన స్థలానికి RTC అధికారులు చేరుకొని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 24, 2025
కడప జిల్లాలో అమానవీయ ఘటన

కడప జిల్లా C.Kదిన్నె మండలం జే.నారాయణపురంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జే.కొత్తపల్లి వెళ్లే రహదారి పక్కన అంగన్వాడీ కేంద్రం ఎదురుగా ఉన్న కంపచెట్లలో నవజాత ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. రోడ్డుపక్కన ఆడుకుంటున్న పిల్లలు గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు.
News December 24, 2025
కడప: కడప జిల్లాలో మద్యం తెగ తాగారు

కడప జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 15 నాటికి 16,94,210 కేసుల మద్యం తాగేశారు. IML లిక్కర్ 11,23,146, బీరు 5,71,084 కేసులు తాగారు. కడపలో 4,65,420, ప్రొద్దుటూరులో 2,81,597, బద్వేల్‌లో 1,89,549, జమ్మలమడుగులో 1,19,417, ముద్దనూరులో 65,812, మైదుకూరులో 1,80,786, ప్రొద్దుటూరులో 2,81,597, పులివెందులలో 1,89,201, సిద్ధవటంలో 71,296, ఎర్రగుంట్లలో 1,31,152 కేసులు విక్రయించారు. గత ఏడాది 12,97,130 తాగారు.


