News December 6, 2025

కర్నూలు స్మార్ట్ సిటీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి: కలెక్టర్

image

కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఏ.సిరి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్, సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వినియోగించి, నిరంతర తాగునీరు, అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీ, ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్, రవాణా వ్యవస్థ, పార్కులు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News March 5, 2026

ఎంపీ నిధుల వినియోగంపై బస్తిపాటి సమీక్ష

image

ఎంపీ నిధుల వినియోగం, అభివృద్ధి పనుల పురోగతిపై ఎంపీ బస్తిపాటి నాగరాజు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీఈడబ్ల్యూఐడీసీ శాఖల అధికారులు పాల్గొన్నారు. 2024-26 ఆర్థిక సంవత్సరాల పనులపై చర్చించిన ఎంపీ, నిధుల ఖర్చులో అలసత్వం వహించవద్దని ఆదేశించారు. పనులు వేగవంతం చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

News March 4, 2026

కర్నూలు: కూతురిని మోసం చేసిన తల్లికి రిమాండ్

image

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ కాలేజీ హెడ్ కుక్ డి.రమణమ్మను చెక్ బౌన్స్, చీటింగ్ కేసులో త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. తన సొంత కూతురు ప్రదీపకు రూ.8 లక్షలు ఇవ్వాల్సి ఉండగా రమణమ్మ చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేసింది. దీనిపై బాధితురాలు కోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తి అనూష నిందితురాలికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు.

News March 4, 2026

కర్నూలు: ఎండల ఎఫెక్ట్.. వడదెబ్బతో సర్పంచ్ భర్త మృతి

image

ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం కర్నూలులో 39 డిగ్రీలు, నంద్యాలలో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. కాగా, నంద్యాల(D) జూపాడు బంగ్లా(M) తాటిపాడు సర్పంచ్ వంగల లక్ష్మీదేవి భర్త కృష్ణారెడ్డి(62) వడదెబ్బతో మృతిచెందారు.