News April 19, 2024
నాడు ఒంగోలు కలెక్టర్.. నేడు ఎమ్మెల్యే అభ్యర్థి

లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ జి.ఎస్.ఆర్.కే.ఆర్ గురువారం తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తనకు ఓటు వేయమని తిరుపతి ప్రజలను కోరారు. విజయ్ కుమార్ 2013 నుంచి 2015 వరకు ఒంగోలు జిల్లా కలెక్టర్‌గా, ప్లానింగ్ సెక్రటరీగా సేవలందించారు.
Similar News
News November 4, 2025
ప్రకాశం: మద్యం దుకాణాల లైసెన్సుల కొరకు.. దరఖాస్తుల ఆహ్వానం!

జిల్లాలోని పొదిలి, దర్శి, కనిగిరి, కంభం ఎక్సైజ్ స్టేషన్లో పరిధిలో 4 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. జిల్లాలోని ఒంగోలు, చీమకుర్తి, సింగరాయకొండ, పొదిలి, దర్శి, మార్కాపురం, కనిగిరి, వై పాలెం, గిద్దలూరు, కంభం స్టేషన్ల పరిధిలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా పదో తేదీలోగా దరఖాస్తులను సమర్పించవచ్చన్నారు. 12న ఒంగోలులో లాటరీ తీస్తామన్నారు.
News November 3, 2025
రేపు ప్రకాశం జిల్లాకు వర్ష సూచన

ప్రకాశం జిల్లాలో మంగళవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ సోమవారం ప్రకటించింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో చెట్లకింద నిలబడరాదని సంస్థ ఎండి ప్రఖర్ జైన్ సూచించారు. అలాగే రైతులు వ్యవసాయ మోటార్ల వద్ద జాగ్రత్త వహించాలన్నారు.
News November 3, 2025
సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రకాశం కలెక్టర్!

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సోమవారం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల అర్జీల పరిష్కారం అనంతరం సంబంధిత దరఖాస్తు దారుడుకి అధికారులు స్వయంగా ఫోన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వారి నుంచి అభిప్రాయాలను స్వీకరించాలని, అలాగే అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ విషయాన్ని అధికారులందరూ గుర్తించాలన్నారు.


