News December 6, 2025

‘పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి’

image

పదో తరగతిలో విద్యార్థులు ఈ సంవత్సరం నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలోని ఎంఈఓలు ఇతర అధికారులతో కలెక్టర్ శనివాకం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు సమాజంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక బాధ్యతను విద్యార్థులకు తెలియజేయాలన్నారు.

Similar News

News April 15, 2026

డిగ్రీ చదువుతూ అప్రెంటిస్.. కొత్తగా 11 కోర్సులు!

image

TG: విద్యార్థులు డిగ్రీ చదువుతూనే అప్రెంటిస్‌‌షిప్‌తో ఉద్యోగాలు తెచ్చుకునేలా విద్యాశాఖ మార్పులు చేస్తోంది. ఇందుకోసం అప్రెంటిస్‌‌షిప్‌ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్(AEDP)ను విస్తరిస్తోంది. 2026-27 నుంచి కొత్తగా 11 కోర్సులను ప్రవేశపెట్టనుంది. ఇప్పటిదాకా 15 కోర్సులు ఉండగా, ఆ సంఖ్య 26కు చేరనుంది. డైరీ, ఫిషరీస్, యానిమేషన్, ఫుడ్ టెక్నాలజీ, ఈ మొబిలిటీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ తదితరాలను చేర్చారు.

News April 15, 2026

సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

image

అసువినాశమైన నానంద సుఖకేళి
సత్యనిష్ఠపరుని సంతరించు
సత్యనిష్ఠజూడ సజ్జన భావంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: ఎప్పుడూ సత్యాన్ని ఆచరించేవాడు ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితాంతం ఆనందంగా ఉంటాడు. ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధపడతాడుగానీ అబద్ధం ఆడడు. మంచి మనసున్నవారికే ఇది సాధ్యమవుతుంది.
<<-se>>#PADHYAM<<>>

News April 15, 2026

రష్యా To ఇండియా.. ఆయిల్ దిగుమతులు 3 రెట్లు!

image

రష్యా నుంచి ఇండియాకు భారీగా క్రూడాయిల్ వస్తోంది. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో దిగుమతులు 3 రెట్లు పెరిగి 5.3 మిలియన్ యూరో(రూ.58 వేల కోట్లు)లకు చేరాయి. వాల్యూమ్ రెట్టింపు కావడం, ధరలు పెరగడం వల్ల ఇంపోర్ట్ వ్యయం పెరిగింది. ఫిబ్రవరిలో 1.8 బిలియన్ యూరోలుగా ఉన్న ఫాసిల్ ఫ్యూయల్(చమురు, బొగ్గు వంటివి) ఇంపోర్ట్స్ మార్చిలో 5.8 బిలియన్ యూరోలకు చేరాయి. ఇందులో 91%(€5.3M) క్రూడాయిల్ ఉత్పత్తులే కావడం గమనార్హం.