News December 7, 2025
కరీంనగర్: ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ

KNR-2 డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు RM శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో భద్రాచలంకు సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. DEC 12న KNR బస్టాండ్ నుంచి సా.8 గం.కు బయలుదేరి, DEC 13న పాపికొండలు బోటింగ్ తదుపరి అదే రోజు రాత్రి భద్రాచలం చేరుకుంటారు. DEC 14న భద్రాచలం, పర్ణశాల దర్శనం చేసుకొని తిరిగి అదే రోజు రాత్రి వరకు KNR చేరుకుంటుందన్నారు. వివరాలకు డిపోను సంప్రదించాలన్నారు.
Similar News
News March 15, 2026
కరీంనగర్: ఎస్సీ యువతకు GOOD NEWS

జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025 -26 ఎస్సీ వర్గాల ఆర్థిక అభివృద్ధి కోసం రవాణా, వ్యవసాయ రంగంలో స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తునట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఆసక్తిగల ఎస్సీ అభ్యర్థులు ఓబీ ఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఈ నెల 17 నుంచి 24 వరకు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News March 14, 2026
KNR: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన.. వినూత్న శిక్ష

కరీంనగర్‌లో మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడిన మంకమ్మతోటకు చెందిన టి.శేఖర్‌కు కోర్టు వినూత్న శిక్ష విధించింది. రూ.6 వేల జరిమానా చెల్లించకపోవడంతో, రెండో తరగతి ప్రత్యేక మేజిస్ట్రేట్ డాక్టర్ ఈదుల లక్ష్మి ఈ తీర్పునిచ్చారు. దీని ప్రకారం నిందితుడు మార్చి 13 నుంచి ఏడు రోజుల పాటు పోలీసుల పర్యవేక్షణలో సామాజిక సేవ చేయాల్సి ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.
News March 13, 2026
KNR: అల్లరి మూకల అదుపుపై పోలీసులకు శిక్షణ

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఏఆర్, క్యూఆర్‌టీ బలగాలకు ‘మాబ్ ఆపరేషన్ డ్రిల్’ నిర్వహించారు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం పర్యవేక్షణలో సిబ్బందికి లాఠీఛార్జ్, స్మోక్ గన్, ‘వజ్ర’ వాహన వినియోగంపై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. అల్లరి మూకలను వ్యూహాత్మకంగా అదుపు చేస్తూనే, స్వీయ రక్షణ పాటించాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


