News December 7, 2025
ప.గో డిగ్రీ విద్యార్థులకు గమనిక

ఆదికవి నన్నయ యూనివర్సిటీ మూడు క్యాంపస్‌లో పీజీ కోర్సులకు ఈ నెల 8-12 వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఎస్. ప్రసన్నశ్రీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లలోని MA, M.com,Mped,Msc కోర్సులకు రాజమహేంద్రవరంలో ఉదయం10-4 గంటల వరకు స్పాట్ అడ్మిషన్‌లు జరుగుతాయన్నారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News March 25, 2026
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నల్లి పోసియ్య

పెంటపాడు ప్రభుత్వ పాఠశాల వృక్ష శాస్త్ర ఉపాధ్యాయుడు నల్లి పోసియ్య రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం తణుకులో జరిగిన జిల్లా స్థాయి 45 ఏళ్ల విభాగం జావెలిన్ త్రోలో ఆయన ప్రథమ స్థానం సాధించారు. తద్వారా ఈ నెల 30, 31 తేదీల్లో గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరగనున్న పోటీలకు అర్హత పొందారు. ఆయనను ఎంఈfyలు శ్రీనివాస్, రామకృష్ణ ఘనంగా అభినందించారు.
News March 25, 2026
ప.గో: కొనలేం.. తినలేం..!

పేద, మధ్యతరగతి ప్రజలకు చికెన్ భారంగా మారింది. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు చోట్ల చికెన్ ధర ఏకంగా రూ. 380కి చేరింది. దీంతో ఫంక్షన్స్ చేసుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. రానున్న రోజుల్లో ధర రూ. 400 దాటే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
News March 25, 2026
ప.గో: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ‘స్లాట్’ దందా!

ప.గో జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద బుధవారం స్లాట్ బుకింగ్ దందా యథేచ్ఛగా సాగుతోందని రిజిస్ట్రేషన్ దారులు ఆరోపిస్తున్నారు. ఉచితంగా జరగాల్సిన బుకింగ్‌లను ముందే నకిలీ పేర్లతో బ్లాక్ చేసి, అవసరమైన వారి నుంచి రూ.1500 నుంచి రూ.2000 వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని అధికారులను కోరుతున్నారు.


