News December 7, 2025
మహబూబ్‌నగర్: భార్యాభర్తలు సర్పంచ్, ఉపసర్పంచ్

గద్వాల మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శనివారం ఉపసంహరణ ముగియడంతో గ్రామం ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. గ్రామంలో సర్పంచ్‌గా శకుంతలమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, ఆమె భర్త వార్డు సభ్యుడిగా ఏకగ్రీవమై, ఆపై ఉపసర్పంచ్‌గా ఎన్నిక కావడం విశేషం. ఇకపై ఈ భార్యాభర్తలు పదవుల్లో కొనసాగనున్నారు.
Similar News
News December 8, 2025
గూడెంకొత్తవీధి: రద్దు చేసిన రాత్రి బస్సుల పునరుద్ధరణ

మావోయిస్టుల PLGA వారోత్సవాల నేపద్యంలో ఈ నెల 2 నుంచి విశాఖ నుంచి గూడెంకొత్తవీధి మండలం సీలేరు- పీలేరు మీదుగా భద్రాచలం బస్సులు రద్దు చేసిన సంగతి తెలిసిందే. వారోత్సవాలు నేటితో ముగుస్తుండడంతో మంగళవారం నుంచి యధావిధిగా గూడెం కొత్త వీధి మీదుగా భద్రాచలం, సీలేరు వెళ్లే నైట్ బస్సులను పునరుద్ధరణ చేస్తున్నట్లు విశాఖ DM మాధురి తెలిపారు.
News December 8, 2025
ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట: ఎస్పీ

అమలాపురంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్‌కు సమస్యలపై 36 వినతులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు లిఖితపూర్వకంగా ఎస్పీకి సమస్యలు అందజేశారు. వాటిపై ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి చట్ట పరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
News December 8, 2025
మీ ఫ్రిజ్ ఎక్కువకాలం పనిచేయాలంటే?

* ఫ్రిజ్ కంపార్ట్‌మెంట్ టెంపరేచర్‌ను 4°C, ఫ్రీజర్‌ను -18°C వద్ద మెయింటేన్ చేయండి.
* వేడి కంటైనర్లను నేరుగా లోపల పెట్టవద్దు.
* సరిగ్గా డోర్ వేయండి. పదేపదే డోర్ తెరవొద్దు.
* ఫ్రిజ్ కాయిల్స్, లోపలి భాగాలను తరచూ క్లీన్ చేయండి.
* ఫ్రిజ్‌ను పూర్తిగా నింపేయకుండా ఖాళీ స్థలాన్ని ఉంచండి.
* ఫ్రిజ్ చుట్టూ కనీసం 10CM స్థలాన్ని వదలండి.
* ఒవెన్స్, డిష్ వాషర్స్, డైరెక్ట్ సన్‌లైట్‌కు దూరంగా ఫ్రిజ్‌ను ఉంచండి.


