News April 19, 2024

సర్వేపల్లిలో సీబీఎన్ టూర్ షెడ్యూల్ ఇదే

image

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గూడూరు నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 2.25 గంటలకు మర్రిపల్లిలోని హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. 3 గంటల నుంచి 4.30 గంటల వరకు గేటు సెంటర్ లో జరిగే ప్రజాగళం సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.50 గంటలకు మర్రిపల్లి హెలిపాడ్ నుంచి సత్యవేడుకు బయలుదేరుతారు.

Similar News

News October 9, 2025

నెల్లూరు: పంట కాలువ ఆనవాళ్ళు ఎక్కడ?

image

గతంలో వేలాది ఎకరాలకు సాగునీటిని అందించిన పంట కాలువ నేడు ఆనవాళ్లు కోల్పోతుంది. స్వర్ణాల చెరువు నుంచి కుడితిపాలెం పంట కాలువకు అనుసంధానంగా ఈ కాలువ ఉండేదట. ప్రస్తుతం మూడోమైలు NH నుంచి కొత్తకాలువ-కోడూరుపాడు మీదుగా కుడితిపాలెం వరకు ఈ కాలువ వెళ్ళేది. కానీ కాలక్రమేణా దీనివెంట ఆక్రమణలు పెరిగడం, నగరం విస్తరించడంతో దీని గురించి పట్టించుకోలేదు. ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణ లోపమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

News October 9, 2025

నాయుడుపేటలో ట్రైన్ కింద పడి ఇంటర్ విద్యార్థి మృతి

image

నాయుడుపేట రైల్వే స్టేషన్ వద్ద ఇంటర్ చదువుతున్న సంతోష్(17) ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడి మృతి చెందాడు. వరదయ్యపాలెంకు చెందిన సంతోష్ వెంకటాచలం వద్ద ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. దసరా సెలవులు ముగించుకొని తడ నుంచి వెంకటాచలానికి ఫ్రెండ్స్‌తో ట్రైన్‌లో బయలుదేరాడు. నాయుడుపేట వద్దకి వచ్చేసరికి అదుపుతప్పి ట్రైన్ కిందపడి మృతి చెందాడు.

News October 9, 2025

నెల్లూరు జిల్లాలో విస్తరిస్తున్న గంజాయి వ్యాపారం!

image

నెల్లూరు జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల వ్యాపారం ఆగడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ బృందం ఉన్నప్పటికీ పరిస్థితి యథాతథంగా ఉంది. యువత, విద్యార్థులే ప్రధాన లక్ష్యంగా మారి గంజాయి వ్యాపారం విస్తరిస్తోంది. విశాఖ నుంచి దిగుమతి చేసే గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి కళాశాలలు, బస్టాండ్లు, థియేటర్లు, కేఫేల్లో విక్రయిస్తున్నారు. మొదట ఉచితంగా ఇచ్చి తర్వాత అధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.