News December 7, 2025

నాగర్‌కర్నూల్‌లో స్వల్పంగా తగ్గిన చలి

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోలిస్తే చలి తీవ్రత స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో జిల్లాలో అత్యల్పంగా చారకొండ మండలంలో 15.2 సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్‌లో 15.5, కల్వకుర్తి, అచ్చంపేట, పదర మండలాల్లో 15.9 చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Similar News

News January 29, 2026

నేడు అజిత్ పవార్ అంత్యక్రియలు

image

ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ఇవాళ ఉ.11 గంటలకు జరగనున్నాయి. ఆయన సొంత నియోజకవర్గం బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. పవార్ అంత్యక్రియలకు PM మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, MH సీఎం ఫడణవీస్, AP మంత్రి లోకేశ్ హాజరవనున్నారు. నిన్న జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ సహా ఐదుగురు మరణించారు.

News January 29, 2026

భూపాలపల్లి జిల్లా మారితే పోటీ చేయను: ఎమ్మెల్యే

image

భూపాలపల్లి జిల్లా మార్పుపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తన నిబద్ధతను చాటుకున్నారు. జిల్లా మార్పు ఖాయమంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు. “జిల్లా మారితే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని” సవాల్ చేశారు. కేవలం ఓట్ల కోసమే కొంతమంది నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు ఇలాంటి తప్పుడు మాటలను నమ్మవద్దని, జిల్లా అస్థిత్వాన్ని కాపాడటమే తన ప్రాధాన్యతన్నారు.

News January 29, 2026

మొక్కజొన్న పంటకు నీరు – ఈ జాగ్రత్తలు తప్పనిసరి

image

మొక్కజొన్న పూత దశలో నీటి ఎద్దడి వల్ల మగపూలు, పీచు ఎండిపోయి, పరాగ సంపర్కం సరిగా జరగక, పై ఆకులు ఎండిపోయి కండెలో గింజల సంఖ్య, పరిమాణం తగ్గుతుంది. పంట పూత దశ నుంచి గింజలు పాలు పోసుకునే వరకు పంట నీటి ఎద్దడికి గురైతే 40 నుంచి 80 శాతం వరకు దిగుబడులు తగ్గుతాయి. గింజ కట్టే సమయంలో నీటి ఎద్దడి ఏర్పడితే గింజ పరిమాణం తగ్గుతుంది. అందుకే పంట ఎదిగే దశలో ఎక్కువ వ్యవధితో, పూత దశలో తక్కువ వ్యవధితో నీరు పెట్టాలి.