News December 7, 2025

ANU పరీక్షల్లో డిజిటల్ విధానం.. ప్రశ్నపత్రాల లీకేజీకి చెక్

image

ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలను అరికట్టేందుకు ఆచార్య నాగార్జున వర్సిటీ (ANU) డిజిటల్ విధానాన్ని ప్రారంభించింది. ఇకపై పరీక్షా కేంద్రాలకు పాస్‌వర్డ్ ఉన్న సీడీల్లోనే ప్రశ్నపత్రాలు పంపనున్నారు. ఇప్పటికే బీఈడీ, లా కోర్సుల్లో ఈ పద్ధతి అమలవుతోంది. మోడరేషన్ కోసం గుంటూరు, నరసరావుపేట, తెనాలి ప్రాంతాల్లో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Similar News

News December 8, 2025

గ్లోబల్ సమ్మిట్.. తొలిరోజు పెట్టుబడుల వెల్లువ

image

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో తొలిరోజు పెట్టుబడులు వెల్లువెత్తాయి. రూ.1.88 లక్షల కోట్లకు సంబంధించిన 35 ఒప్పందాలు కుదిరాయి. రంగాల వారీగా ఆ వివరాలు ఇలా..
* డీప్ టెక్, ఫ్యూచర్ సిటీ&కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్- రూ.1,04,000 కోట్లు
* రెన్యూవబుల్ ఎనర్జీ&పవర్ సెక్యూరిటీ- రూ.39,700 కోట్లు
* ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్- రూ.19,350 కోట్లు
* అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ – రూ.13,500 కోట్లు

News December 8, 2025

చంద్రుడిపై చివరి అడుగుకు 53 ఏళ్లు

image

US ‘అపోలో-11’ మిషన్ ద్వారా 1969లో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు మిషన్లలో 12మంది ‘మామ’ను కలిసి వచ్చారు. జాబిలిపై మనిషి చివరిసారిగా కాలుమోపి 53ఏళ్లవుతోంది. 1972 DEC 7-19 మధ్య అపోలో-17 ద్వారా యూజీన్, హారిసన్ మూన్‌పై దిగారు. 75గంటలు గడిపి రోవర్‌పై 35KM ప్రయాణించారు. 110KGల రాళ్లు, మట్టిని తీసుకొచ్చారు. వాటి ద్వారా అక్కడ ఒకప్పుడు అగ్నిపర్వతం ఉండేదని గుర్తించారు.

News December 8, 2025

BHPL: బోల్తా కొట్టిన ‘డమ్మీ’ వ్యూహం..!

image

భూపాలపల్లి జిల్లా గనపురం(ములుగు)మండలం గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థులుగా భార్యభర్తలు బరిలో నిలవాల్సిన అనూహ్య పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ బలపరిచిన అరుణ్ ప్రధాన అభ్యర్థిగా నామినేషన్ వేయగా.. అతని భార్య గీతాంజలి డమ్మీ నామినేషన్ వేశారు. నామినేషన్ ఉపసంహరణ చేసే సమయానికి గీతాంజలి అందుబాటులో లేకపోవడంతో ఆమెను కూడా తుది అభ్యర్థుల జాబితాలో చేర్చారు. దీంతో ఆ దంపతులిద్దరూ బరిలో నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.