News December 7, 2025

పులివెందులలో YS జార్జిరెడ్డికి విజయమ్మ నివాళి.!

image

మాజీ ముఖ్యమంత్రి YSR సోదరుడు వైయస్ జార్జిరెడ్డి వర్ధంతి ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సమాధుల తోటలో వైయస్ జార్జిరెడ్డి సమాధితోపాటు రాజారెడ్డి, వివేకానందరెడ్డి సమాధుల వద్ద పూలమాలలు పెట్టి వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ నివాళులర్పించారు. అనంతరం పులివెందులలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.

Similar News

News March 17, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,600
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,352
* వెండి 10 గ్రాముల ధర రూ.2,610.

News March 17, 2026

సిద్దవటం: భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు

image

సిద్దవటం మండలంలోని కపర్దేశ్వర స్వామి కోన వద్ద 2014లో జరిగిన హత్య కేసులో నలుగురు ముద్దాయిలకు కోర్టు జీవిత ఖైదు విధించింది. భర్తను హత్య చేసి బంగారు నగలు దోచుకున్న కేసులో భార్యతో పాటు మరో ముగ్గురిపై నేరం రుజువవడంతో కడప కోర్టు ఒక్కొక్కరికి జీవిత ఖైదు, రూ.2000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

News March 17, 2026

అవినీతి ఆరోపణలపై కడప కార్పొరేషన్ ఇంజినీర్ల పెన్షన్లలో కోత

image

కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజినీరింగ్ విభాగంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ముగ్గురు రిటైడ్ ఇంజినీర్ల పెన్షన్లలో కోత విధిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ACB ఫిర్యాదుపై విచారణ జరిపిన ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ఇంజినీర్లు శ్రీనివాసులు, దస్తగిరి రెడ్డి, దౌలాకు వారి పెన్షన్లో 5 శాతం కోత విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పనులను విభజించి, నామినేషన్‌పై కట్టబెట్టడంపై చర్యలు తీసుకున్నారు.