News December 7, 2025
ఫేక్ బ్యాంకు గ్యారంటీలు… రిలయన్స్‌పై ఛార్జిషీట్

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్, మరో 10 కంపెనీలపై ED ఛార్జిషీట్ దాఖలు చేసింది. ₹68కోట్ల ఫేక్ బ్యాంకు గ్యారంటీలు జారీచేసి మనీల్యాండరింగ్‌కు పాల్పడిన కేసులో ఈడీ చర్యలు వేగవంతం చేసింది. ఈ కేసులో అనిల్ అంబానీ ఇతరులు ₹17000 కోట్లమేర బ్యాంకులను మోసగించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. తాజాగా ₹1120CR ఆస్తుల్ని కూడా ED అటాచ్ చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటివరకు ₹10117 CR ఆస్తులు అటాచ్ అయ్యాయి.
Similar News
News March 13, 2026
నేడే పీఎం కిసాన్ నిధులు విడుదల

పీఎం కిసాన్ 22వ విడత నిధులను కేంద్రం ఇవాళ విడుదల చేయనుంది. ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో ఈ డబ్బులను రిలీజ్ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా అర్హులైన 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో.. రూ.18,640 కోట్లను జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2019 నుంచి కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలను వ్యవసాయ పెట్టుబడి సాయం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.
News March 13, 2026
పీఎం కిసాన్ అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి?

పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో? లేదో? ఇలా చెక్ చేసుకోండి. ☛ ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ను సందర్శించాలి.
☛ ‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
☛ అక్కడ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం (మీ వ్యవసాయ భూమి ఉన్న గ్రామం) వివరాలను ఎంపిక చేసుకొని ‘గెట్ రిపోర్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
☛ అక్కడ గ్రామాల వారీగా లబ్దిదారుల జాబితా వస్తుంది.
News March 13, 2026
ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పుడే పిల్లలను కనాలి: వరలక్ష్మి

దంపతులు పిల్లలను కనడంపై నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘బిడ్డలను కనడం, పెంచడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. సరిగ్గా ప్లాన్ చేసుకొని ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పుడే పిల్లలను కనాలి. ఈ రోజుల్లో ప్లాన్ లేకుండా ముందుకెళ్తే ఇబ్బందులు తప్పవు. బిడ్డలను కనడానికి నేనేమీ వ్యతిరేకం కాదు. కానీ మీకు ఎవరూ ఆర్థికంగా సాయం చేయరని గుర్తుంచుకోవాలి’ అని పేర్కొన్నారు.


