News December 7, 2025
10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తాం: యజమానుల సంఘం

AP: ఎల్లుండి (డిసెంబర్ 9) అర్ధరాత్రి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేయాలని లారీ ఓనర్ల సంఘం నిర్ణయించింది. 13 ఏళ్లు దాటిన గూడ్స్ వాహనాలపై కేంద్రం పెంచిన టెస్టింగ్, ఫిట్‌నెస్ <<18452599>>ఛార్జీలను<<>> వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. అదనపు ఫీజుల భారం సరుకు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. డిమాండ్లను పట్టించుకోకపోతే రైల్వే షెడ్లు, షిప్‌యార్డుల్లో 10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తామని హెచ్చరించింది.
Similar News
News March 12, 2026
సంజూకు జట్టే ముఖ్యం.. సెంచరీలు కాదు: సూర్య

T20WCలో అదరగొట్టిన సంజూ శాంసన్‌పై కెప్టెన్ సూర్య ప్రశంసలు కురిపించారు. ‘చివరి 3 మ్యాచుల్లో ఆయన 97*, 89, 89 స్కోర్లు చేశారు. కావాలనుకుంటే వాటిని సెంచరీలుగా మలిచేవారు. కానీ 89 నుంచి 100కు చేరడానికి 10 బంతులను తీసుకుంటే నాన్ స్ట్రైకర్ నుంచి 6 బాల్స్‌ను లాగేసుకున్నట్లే. సంజూకు సెంచరీల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఆయన అలా ఆడారు కాబట్టే దూబే 6 బంతుల్లో 28 రన్స్ కొట్టారు’ అని పేర్కొన్నారు.
News March 12, 2026
మనుషులూ 200 ఏళ్లు బతకొచ్చు!

భూమిపై ఎక్కువకాలం బతికే జీవుల్లో తిమింగలం ఒకటి. అందులోనూ Bowhead రకం 200 ఏళ్లు జీవిస్తుంది. దీని దీర్ఘాయువుకు క్యాన్సర్, ఇతర వ్యాధుల నియంత్రణకు DNA రిపేర్ ప్రొటీన్‌గా పిలిచే CIRBP కారణమని రోచెస్టర్ వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీన్ని మానవ కణాలు, కొన్ని రకాల ఈగల్లో ప్రవేశపెట్టగా DNA రిపేర్ సాధ్యమైంది. ఈగలు ఎక్కువ కాలం జీవించాయి కూడా. మానవుల్లోనూ సక్సెస్ అయితే 200Y బతకడం సాధ్యమేనంటున్నారు.
News March 12, 2026
మునగలో కాయతొలుచు ఈగ నివారణకు సూచనలు

మునగ పంటలో విత్తనాలు నాటిన 5 నెలలకు పూత దశ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పంటకు కాయ తొలుచు ఈగ ముప్పు ఎక్కువ. ఇది పంటను ఆశించి పిందె దశలో కాయలోకి ప్రవేశించి లోపలి పదార్థాన్ని తిని నాశనం చేస్తుంది. దీని వల్ల కాయల ఆకారం మారిపోయి వంకరగా అవుతాయి. కాయతొలుచు ఈగ నివారణకు పూత దశలో లీటరు నీటికి ఫానలోన్ 2ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


