News December 7, 2025

నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలి: ఎస్పీ

image

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసు అధికారులు సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు చేపట్టారు.

Similar News

News March 11, 2026

కర్నూలు జిల్లా రైతులకు తీపి కబురు

image

అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2025-26 ఆర్థిక సహాయం ఈ నెల 13న విడుదల కానుందని జేడీఏ వరలక్ష్మి తెలిపారు. అర్హత కలిగిన రైతులకు రూ.6,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నామని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,72,757 మంది లబ్ధిదారులకు రూ.154.94 కోట్లు అందుతాయని జిల్లా వ్యవసాయ అధికారి వివరించారు. ఈ నిధులు డీబీటీ ద్వారా రైతుల ఖాతాలకు చేరుతాయి.

News March 11, 2026

కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 153 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 153 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 4,242 మందికి గానూ 4,089 మంది మాత్రమే హాజరైనట్లు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఆయన వెల్లడించారు. నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు.

News March 11, 2026

OTPలు ఎవరికీ చెప్పకండి: జేసీ

image

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో డిజిటల్ లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు RBI రూపొందించిన పోస్టర్లను జేసీ నూరుల్ ఖమర్ ఆవిష్కరించారు. జేసీ మాట్లాడుతూ.. ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు ‘డిజిటల్ పేమెంట్స్ అవేర్నెస్ వీక్’ నిర్వహిస్తున్నామన్నారు. బ్యాంక్ అధికారులమని చెప్పినా ఎవరికీ OTP చెప్పకూడదన్నారు. కేవలం బ్యాంక్ అధికారిక యాప్స్, వెబ్‌సైట్ల ద్వారానే లావాదేవీలు చేయాలన్నారు.