News December 7, 2025
వీటిని తింటే కళ్లద్దాల అవసరమే రాదు

ప్రస్తుత రోజుల్లో చిన్నారులను సైతం కంటి చూపు సమస్యలు వేధిస్తున్నాయి. పోషకాహార లోపమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. రోజూ క్యారెట్, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, చిలకడదుంపలు తినిపిస్తే Vitamin A సమృద్ధిగా లభిస్తుంది. చేపలు, వాల్‌నట్స్, అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు వల్ల కళ్ల ఆరోగ్యం మెరుగవుతుంది. క్యాప్సికం, బ్రోకలీ వంటి ఆహారాలు కూడా కంటి నరాలకు మేలు చేస్తాయి.
Similar News
News December 8, 2025
వర్షాలు, చలి.. కోళ్ల పెంపకందారులకు సూచనలు

ప్రస్తుతం కొన్నిచోట్ల కురుస్తున్న వర్షాలు, చలి వల్ల కోళ్లకు వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. అందుకే కోళ్ల ఫారాన్ని శుభ్రంగా ఉంచి, నీరు బయటకు పోయేలా డ్రైనేజ్ సక్రమంగా ఉండేట్లు చూడాలి. కోళ్లకు నీరందించే నీటి బుట్టలు లీక్ కాకుండా చూసుకోవాలి. లిట్టర్ బాగా తడిగా ఉంటే దాన్ని వెంటనే తొలగించాలి. ఫారంలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలి. కోళ్లలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెటర్నరీ డాక్టరును సంప్రదించాలి.
News December 8, 2025
గృహ ప్రవేశ సమయంలో గోవు ఎందుకు?

హిందూ సంప్రదాయం ప్రకారం.. ఇంటి నిర్మాణంలో తెలియక చేసిన దోషాలను తొలగించడానికి గోమాతను ఇంట్లోకి తీసుకువస్తారు. గోవు అంటే లక్ష్మీదేవి స్వరూపం. పవిత్రతకు నిలయంగా కూడా భావిస్తారు. గోమూత్రం, గోమయం పవిత్రమైనవి. గోవు ప్రవేశంతో ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే గోవు పాలు, పెరుగు వంటివి వాడటం వలన శరీరానికి, మనసుకు ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం.
News December 8, 2025
భారీ జీతంతో NHAIలో 84 పోస్టులు

NHAIలో 84 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత గలవారు DEC 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA, B.L.Sc, MA, డిగ్రీ, CA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నెలకు Dy. mngrకు రూ.56,100-రూ.1,77,500, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ Asst.కు రూ.35,000-రూ.1,12,400, Jr ట్రాన్స్‌లేటర్‌కు రూ.35,400-రూ.1,12,400, అకౌంటెంట్‌కు రూ.29,200-రూ.92,300, స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500-రూ.81,100 చెల్లిస్తారు.


