News December 7, 2025
పెద్దపల్లి: 851 వార్డుల్లో పోలింగ్

గ్రామ పంచాయతీ మూడో దశ వార్డు ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. పెద్దపల్లి జిల్లాలోని 4 మండలాల్లో ఉన్న 852 వార్డులలో కేవలం ఒక్క వార్డులో మినహా, మిగిలిన 851 వార్డులు పోలింగ్‌కు వెళ్లనున్నాయి. ఎలిగేడులో 269, ఓదెలలో 467, పెద్దపల్లిలో 712, సుల్తానాబాద్‌లో 566 చొప్పున కలిపి మొత్తం 2,014 వార్డ్ మెంబర్ నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు జిల్లా పంచాయతీ అధికారి ప్రకటించారు.
Similar News
News December 8, 2025
తెలంగాణ రైజింగ్ సమ్మిట్.. చంద్రబాబు విషెస్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు చెప్పారు. ఈరోజు, రేపు జరిగే ఈ సదస్సు తెలంగాణ అభివృద్ధి, పురోగతి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నానని Xలో పోస్టు చేశారు. కాగా ఈ మధ్యాహ్నం గవర్నర్ జిష్ణుదేవ్ ఈ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు.
News December 8, 2025
విజయవాడలో ప్రత్యక్షమైన వైసీపీ నేత..!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ మోహన్ ప్రధాన అనుచరుడు విజయవాడ పటమట పోలీసు స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. ప్రసాదంపాడుకి చెందిన కొమ్మకోట్లు సోమవారం ఉదయం సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో లొంగిపోవడానికి వచ్చాడు. ఈ క్రమంలో వైసీపీ అనుచరులు భారీ సంఖ్యలో పటమట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కొమ్మకోట్లు గత పది నెలలుగా అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే.
News December 8, 2025
వర్షాలు, చలి.. కోళ్ల పెంపకందారులకు సూచనలు

ప్రస్తుతం కొన్నిచోట్ల కురుస్తున్న వర్షాలు, చలి వల్ల కోళ్లకు వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. అందుకే కోళ్ల ఫారాన్ని శుభ్రంగా ఉంచి, నీరు బయటకు పోయేలా డ్రైనేజ్ సక్రమంగా ఉండేట్లు చూడాలి. కోళ్లకు నీరందించే నీటి బుట్టలు లీక్ కాకుండా చూసుకోవాలి. లిట్టర్ బాగా తడిగా ఉంటే దాన్ని వెంటనే తొలగించాలి. ఫారంలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలి. కోళ్లలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెటర్నరీ డాక్టరును సంప్రదించాలి.


