News December 7, 2025
NTR: శబరిమలై స్పెషల్ ట్రైన్స్ నడిచే తేదిలివే.!

శబరిమలై వెళ్లేవారికై విజయవాడ మీదుగా కొల్లం వరకు స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 13న నం.07117 సిర్పూర్ కాగజ్‌నగర్-కొల్లం, 20న నం.07121 చర్లపల్లి-కొల్లం, 24న నం.07123 H.S. నాందేడ్-కొల్లం, 15న నం.07118 కొల్లం-చర్లపల్లి, 22, 26న నం.07122, నం.07124 కొల్లం-చర్లపల్లి మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తాయన్నారు. ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయన్నారు.
Similar News
News December 8, 2025
మహిళలకు అవకాశం ఇస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారు: కలెక్టర్

మహిళలకు తగిన అవకాశం కల్పిస్తే ఏ రంగంలోనైనా రాణించగలరని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో, ఐదు రోజుల ఈవెంట్ మేనేజ్‌మెంట్ శిక్షణను పూర్తి చేసిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లాలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను మహిళా SHG సభ్యులకు అప్పగించేలా అవకాశాలు కల్పించాలని DRDO సురేందర్‌ను ఆయన ఆదేశించారు.
News December 8, 2025
స్టేజ్ 2 ఆర్ఓల పాత్ర కీలకం: ASF కలెక్టర్

సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరుగనున్న ఎన్నికల నిర్వహణలో స్టేజ్ 2 ఆర్ఓల పాత్ర కీలకమైనదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం ASF కలెక్టరేట్‌లో జిల్లా పంచాయతీ అధికారులతో కలిసి రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల సక్రమంగా జరిగేందుకు సహకరించాలని సూచించారు.
News December 8, 2025
విజయవాడలో ధరల నియంత్రణ కమిటీ సమావేశం

విజయవాడలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా నిర్వహించారు. ఈ సమావేశంలో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితిని సమీక్షించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ధరలు అదుపులో ఉన్నాయని తెలిపారు. కూరగాయల దిగుమతులు పెరగడంతో రానున్న రోజుల్లో కూడా కొరత ఉండదని ఆమె స్పష్టం చేశారు.


