News December 7, 2025
764 ఉద్యోగాలకు నోటిఫికేషన్

DRDOకు చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్‌లో 764 ఉద్యోగాలకు షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B 561, టెక్నీషియన్-A 203 పోస్టులున్నాయి. వయసు 18-28 ఏళ్లు ఉండాలి. ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయి నోటిఫికేషన్ https://www.drdo.gov.in/లో అందుబాటులో ఉంటుంది.
Similar News
News December 8, 2025
రాష్ట్రంలో రూ.25వేల కోట్ల పెట్టుబడులు: కరణ్ అదానీ

TGలో రూ.25వేల కోట్లతో 48 మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు బిలియనీర్ గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రకటించారు. ఇప్పటికే అదానీ గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిందని గుర్తుచేశారు. అటు బెంగళూరుతో HYD పోటీ పడుతోందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. మరిన్ని పెట్టుబడులు ఆకర్షించి రేవంత్ సర్కార్ మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
News December 8, 2025
కుందేళ్ల పెంపకానికి మేలైన జాతులు

కుందేళ్ల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో చేపట్టవచ్చు. మాంసోత్పత్తితో పాటు ఉన్ని కోసం కూడా వీటిని పెంచుతున్నారు. చిన్న రైతులు, నిరుద్యోగ యువత కుందేళ్ల ఫామ్ ఏర్పాటు చేసుకొని ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. కూలీలతో పనిలేకుండా కుటుంబసభ్యులే ఫామ్ నిర్వహణ చూసుకోవచ్చు. మాంసం ఉత్పత్తికి న్యూజిలాండ్ వైట్, గ్రేజైంట్, సోవియట్ చించిల్లా, వైట్ జైంట్, ఫ్లైమిష్ జెయింట్, హార్లెక్విన్ కుందేళ్ల రకాలు అనువైనవి.
News December 8, 2025
భారీ జీతంతో CSIR-CECRIలో ఉద్యోగాలు

CSIR-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(<


