News December 8, 2025
తిరుపతి: నేడు కీలక కేసుల విచారణ

తిరుపతి వేదికగా సాగుతున్న పలు కీలక కేసులు సోమవారం కోర్టులో విచారణకు రానున్నాయి. తిరుమల కల్తీ నెయ్యి కేసులో నెల్లూరు ACB కోర్టులో ఏ-16 అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్, ఏ-29 సుబ్రహ్మణ్యం కస్టడీ పిటిషన్ విచారణ జరగనుంది. మరో వైపు హై కోర్టులో పరకామణీ కేసు కూడా విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Similar News
News December 10, 2025
అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు: మంత్రి సంధ్యారాణి

రాష్ట్ర వ్యాప్తంగా 58,746 అంగన్వాడీ కార్యకర్తలుకు 5జీ మొబైల్ ఫోన్లు ఉచితంగా అందిస్తున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. బుధవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో పలువురు అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లు అందజేశారు. అంగన్వాడీ కార్యకర్తలు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టబడి ఉందని ఆమె తెలిపారు.
News December 10, 2025
PGRS కమాండ్ కంట్రోల్ రూమ్ కలెక్టర్ తనిఖీ

PGRS కమాండ్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల నుంచి వస్తున్న అర్జీలు, పరిష్కారంపై ఆరా తీశారు. ఆయా శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో సమన్వయం చేస్తున్న తీరు తెన్నులను ఆయన అడిగి తెలుసుకున్నారు. చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. అర్జీలు పునరావృతంగాకుండా, పద్ధతి ప్రకారం పరిష్కారం అయ్యేలా పని చేయాలన్నారు.
News December 10, 2025
పిల్లలకు టీకాలు వేయించుకోవాలి: గద్వాల డీఎంహెచ్ఓ

ప్రాణాంతకమైన డిఫ్తీరియా, టెటానస్ వ్యాధుల నుంచి పిల్లలను రక్షించడానికి టీకాలను వేయించుకోవాలని డీఎంహెచ్ఓ కిరణ్మయి సూచించారు. గద్వాల ఎంసీఏ సెంటర్‌లో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని డీఎంహెచ్ఓ బుధవారం పరిశీలించారు. జ్వరం రాకుండా సిరప్ మందులను ఇవ్వాలని సూచించారు. మందుల స్టాక్ రిజిస్టర్ మైంటైన్ చేయాలని ఆశావర్కర్లను ఆదేశించారు.


