News April 19, 2024

100 రోజుల్లో రుణ మాఫీ చేస్తామనలేదు: భట్టి

image

TG: మేడిగడ్డకు రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించారని, అది కూలిపోతే వాస్తవాలు ప్రజలకు తెలియకూడదా? అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రుణమాఫీపై స్పందిస్తూ.. ‘మేం 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పలేదు. కానీ రుణ మాఫీకి కట్టుబడి ఉన్నాం’ అని తెలిపారు. కరెంటు కోతలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమలకు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని చెప్పారు.

Similar News

News January 27, 2026

కవిత కొత్త పార్టీ పేరు ఇదేనా?

image

TG: సొంత పార్టీ పెడుతున్నానని ప్రకటించిన కవిత ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు పార్టీ పేరు, గుర్తు, విధివిధానాలపై ఆమె ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ‘తెలంగాణా ప్రజా జాగృతి’ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. తనకు సెంటిమెంట్‌గా ఉన్న జాగృతి పేరును పార్టీ పేరులో కొనసాగించాలని కవిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఉగాది నాటికి పార్టీ పేరును ప్రకటించే అవకాశముంది.

News January 27, 2026

ఇండియన్ మార్కెట్లోకి ‘డస్టర్’ రీఎంట్రీ

image

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ తన ‘డస్టర్’ కారును మరోసారి మార్కెట్లోకి తీసుకొచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఒకప్పుడు పాపులరైన ఈ కార్ల ఉత్పత్తి 2022లో నిలిచిపోయింది. అయితే చెన్నైలోని తయారీ ప్లాంట్‌‌‌ను పూర్తిగా సొంతం చేసుకున్న కంపెనీ డస్టర్‌తో రీఎంట్రీ ఇచ్చింది. దీంతో టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా, మారుతీ గ్రాండ్ విటారా, కియా సెల్టోస్‌తో డస్టర్ పోటీ పడనుంది.

News January 27, 2026

USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి

image

అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అనేక నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షల మంది అంధకారంలో ఉన్నారు. పలు ఘటనల్లో 29 మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 15కుపైగా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొనగా రవాణా స్తంభించిపోయింది. మంచు తుఫాన్ ప్రభావంతో సుమారు 17వేలకుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. పరిస్థితులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.