News April 19, 2024
హార్దిక్‌పై నెటిజన్ విమర్శ.. షేర్ చేసిన నబీ!
ముంబై ఇండియన్స్ ఆటగాడు నబీ నిన్నటి మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేదు. దీనిపై అతడి అభిమాని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ముంబై ఇండియన్స్! మీ కెప్టెన్ తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా వింతగా, ఇతరులను ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. నబీ ఈరోజు బౌలింగ్ చేయలేదు. తను గేమ్ ఛేంజర్. కీలక సమయంలో రెండు క్యాచ్‌లు, ఓ రనౌట్ చేశారు’ అని పోస్ట్ పెట్టారు. దాన్ని నబీ తన ఇన్‌స్టా స్టోరీగా షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
Similar News
News November 19, 2024
మెటాకు రూ.213 కోట్ల ఫైన్
వాట్సాప్ మాతృసంస్థ మెటాకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ₹213కోట్ల జరిమానా విధించింది. ప్రైవసీ పాలసీకి సంబంధించి 2021లో ఆ సంస్థ తీసుకొచ్చిన అప్‌డేట్ అనైతికం అని పేర్కొంది. ఈ అప్‌డేట్ ప్రకారం యూజర్లు తమ వాట్సాప్ డేటాను ఇతర మెటా కంపెనీలతో షేర్ చేసుకునేందుకు తప్పనిసరిగా అంగీకరించాలి. అయితే ఈ విషయంలో యూజర్లదే తుది నిర్ణయమని, 2016 నాటి విధానానికి భిన్నంగా కొత్త విధానాన్ని అమలు చేసినందుకు ఫైన్ వేసింది.
News November 19, 2024
టీటీడీ నిర్ణయం హర్షణీయం: పవన్ కళ్యాణ్
AP: తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తూ <<14644612>>టీటీడీ తీసుకున్న నిర్ణయం<<>> హర్షణీయం అని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఎన్నికల సమయంలో నగర ప్రజలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని, వారికి తాను హామీ ఇచ్చానని పేర్కొన్నారు. ‘తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు ఆలోచనలు చేస్తూ, ఆ దిశగా అధికార యంత్రాగాన్ని నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.
News November 19, 2024
BGTలో అత్యధిక వికెట్లు, రన్స్ తీసింది వీరే
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నాథన్ లియోన్ (116) కొనసాగుతున్నారు. అతని తర్వాతి స్థానాల్లో అశ్విన్ (114), కుంబ్లే (111), హర్భజన్(95), రవీంద్ర జడేజా (85), జహీర్ ఖాన్ (61) ఉన్నారు. అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (3262) పేరిట ఉంది. అతని తర్వాతి స్థానాల్లో పాంటింగ్ (2555), లక్ష్మణ్ (2434), ద్రవిడ్ (2143), క్లార్క్ (2049), పుజారా (2033) ఉన్నారు.