News December 8, 2025
పెద్దపల్లి: 23 ఏళ్ల తర్వాత మళ్లీ అవకాశం!

ఒకప్పటి అసెంబ్లీ నియోజకవర్గమైన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామంలో సర్పంచ్ పదవికి 23ఏళ్ల తర్వాత మళ్లీ BCలకు అవకాశం లభించింది. 2002లో సర్పంచ్ పదవి BC(జనరల్) అభ్యర్థికి కేటాయించగా మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన సాన రాజలింగయ్య గెలుపొందారు. తిరిగి సైతం BC(జనరల్)కు రిజర్వు కావడంతో ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరు రిటైర్డ్ టీచర్ కాగా, నలుగురు యువకులు ఉన్నారు.
Similar News
News January 3, 2026
GHMC కీలక నిర్ణయం.. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో మార్పు

GHMC కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సహాయ వైద్యాధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో మార్పులు తీసుకొచ్చారు. ఇకపై ఈ సర్టిఫికెట్లు సహాయ మున్సిపల్ కమిషనర్ల ద్వారా జారీ చేయనున్నట్లు GHMC కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ నిర్ణయంతో పరిపాలనా సమన్వయం మెరుగుపడడంతో పాటు ప్రజలకు సేవలు మరింత వేగంగా అందనున్నాయని పేర్కొంది.
News January 3, 2026
ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు

<
News January 3, 2026
ASF జిల్లా సర్పంచులకు శిక్షణ

ఆసిఫాబాద్ జిల్లాలోని సర్పంచులకు 2026 సంవత్సరానికి సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించన్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 6 నుంచి 12వ తేదీ వరకు యోగా, కళా మేళా, మానసిక శిక్షణ, పర్యటన, లక్ష్యసాధన, సేవా భావం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సర్పంచులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.


