News December 8, 2025
అరకు: ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

అరకులోయ మండలం ఇరగాయి పంచాయతీ పరిధి ఉరుములులో ఎలుగుబంటి దాడిలో గిరిజనుడికి తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అప్పారావు గ్రామ సమీపంలోని కాఫీ తోటకి కాపలగా వెళ్లాడు. ఆదివారం అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. క్షతగాత్రుడిని 108లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఎలుగుబంట్లు పొలాల్లోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News January 9, 2026
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం

AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఈరోజు సాయంత్రానికి శ్రీలంకలో హంబన్‌తోట, బట్టికోల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో నేడు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
News January 9, 2026
కలుపు తీయని మడి, దేవుడు లేని గుడి

సాగులో కలుపు ప్రధాన సమస్య. దీన్ని తొలగించకపోతే పంట సరిగా పండదు. కలుపు మొక్కలు పంటకు అందాల్సిన పోషకాలను లాగేసుకుంటాయి. అలాగే గుడి ఎంత అందంగా ఉన్నా, అందులో దేవుని విగ్రహం లేకపోతే ఆ గుడికి విలువ ఉండదు. ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని వెనుక ఉన్న అసలు లక్ష్యం నెరవేరకపోతే, ఆ పని వ్యర్థమని ఈ సామెత చెబుతుంది. అలాగే క్రమశిక్షణ లేని జీవితం, పవిత్రత లేని మనస్సు కూడా ప్రయోజనం లేనివని ఈ సామెత భావం.
News January 9, 2026
కుబేర యోగం ఉంటే ఏం జరుగుతుంది?

కుబేర యోగం ఉన్నవారికి అదృష్టం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. వీరు ఏ వ్యాపారం చేపట్టినా అందులో భారీ లాభాలు గడిస్తారు. చిన్న వయసులోనే సొంత ఇల్లు, వాహనాలు, విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. వీరికి పూర్వీకుల ఆస్తి కలిసి రావడమే కాకుండా, లాటరీ లేదా షేర్ మార్కెట్ వంటి మార్గాల ద్వారా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు అనేవి వీరి జీవితంలో ఉండవు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి.


