News December 8, 2025
చౌటుప్పల్: ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

కుటుంబ కలహాల కారణంగా మనస్తాపం చెందిన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో జరిగింది. సూర్కంటి కిరణ్ రెడ్డి (25) ఇంట్లోనే ఉరివేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ మన్మథ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 11, 2026
PSLV-C62 కౌంట్‌డౌన్ స్టార్ట్

AP: తిరుపతి(D) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్‌లో PSLV-C62 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రేపు ఉ.10.18 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది PSLVకి 64వ ప్రయోగం కాగా PSLV-DL వేరియంట్‌లో 5వ మిషన్. ఈ వాహక నౌక 44.4 మీటర్ల ఎత్తు, 260 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ద్వారా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1తో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు.
News January 11, 2026
జగిత్యాల: పేపర్ లీకేజీలో నలుగురు సస్పెండ్.. 34మంది తొలగింపు

సర్వీస్‌లో ఉన్న ఏఈవోలు AG బీఎస్సీ పాస్ కావడానికి ఇల్లీగల్ పనులకు పూనుకున్నారు. AG కళాశాలకు చెందిన సిబ్బందితో కుమ్మక్కై పరీక్ష ప్రశ్నపత్రాలను వాట్సాప్ గ్రూప్ ద్వారా లీక్ చేశారు. అయితే వరంగల్లో పేపర్ లీకేజీ కాగా, జగిత్యాల AG కళాశాలలో వెలుగులోకి వచ్చింది. దీంతో స్పందించిన యూనివర్సిటీ అధికారులు నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేయగా, లీకేజ్‌కు కారకులైన 34 మంది ఏఈఓలను కళాశాలల నుంచి తొలగించారు.
News January 11, 2026
తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్(ట్రైనీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు 11నెలల శిక్షణ ఉంటుంది. నెలకు రూ.10వేలు స్టైఫండ్ చెల్లిస్తారు. ప్రయాణికుల చెక్-ఇన్, బ్యాగేజ్, టికెటింగ్, బోర్డింగ్ సేవల్లో శిక్షణ ఇస్తారు. ఈనెల 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వివరాలకు <


