News December 8, 2025
భీమవరంలో బాలికలపై టీచర్ లైంగిక వేధింపులు..!

విద్యార్థినులను ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భీమవరం మండలం గొల్లవానితిప్ప ఉన్నత పాఠశాల బాలికలను మ్యాథ్స్ టీచర్ లైంగికంగా వేధించినట్లు తెలియడంతో తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా నిర్వహించిన PTMలో తల్లిదండ్రులు అధికారులకు వివరించారు. చట్టపరంగా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
Similar News
News January 11, 2026
సూర్యాపేట: గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి 5వ తరగతి ప్రవేశాలకు, 6-9 తరగతుల్లో ఖాళీ సీట్లకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 21లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. కులం, ఆదాయం, ఆధార్ పత్రాలతో అధికారిక వెబ్‌సైట్లలో నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News January 11, 2026
PSLV-C62 కౌంట్‌డౌన్ స్టార్ట్

AP: తిరుపతి(D) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్‌లో PSLV-C62 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రేపు ఉ.10.18 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది PSLVకి 64వ ప్రయోగం కాగా PSLV-DL వేరియంట్‌లో 5వ మిషన్. ఈ వాహక నౌక 44.4 మీటర్ల ఎత్తు, 260 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ద్వారా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1తో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు.
News January 11, 2026
జగిత్యాల: పేపర్ లీకేజీలో నలుగురు సస్పెండ్.. 34మంది తొలగింపు

సర్వీస్‌లో ఉన్న ఏఈవోలు AG బీఎస్సీ పాస్ కావడానికి ఇల్లీగల్ పనులకు పూనుకున్నారు. AG కళాశాలకు చెందిన సిబ్బందితో కుమ్మక్కై పరీక్ష ప్రశ్నపత్రాలను వాట్సాప్ గ్రూప్ ద్వారా లీక్ చేశారు. అయితే వరంగల్లో పేపర్ లీకేజీ కాగా, జగిత్యాల AG కళాశాలలో వెలుగులోకి వచ్చింది. దీంతో స్పందించిన యూనివర్సిటీ అధికారులు నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేయగా, లీకేజ్‌కు కారకులైన 34 మంది ఏఈఓలను కళాశాలల నుంచి తొలగించారు.


