News December 8, 2025

కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత 8.2°C

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆరెంజ్ అలెర్ట్ జారీ అయిన ప్రదేశాల్లో నస్రుల్లాబాద్ 8.2°C, బొమ్మన్ దేవిపల్లి 8.3, డోంగ్లి 8.4, బీబీపేట 8.6, బీర్కూర్ 8.7, సర్వాపూర్ 8.8, లచ్చపేట, జుక్కల్ 9, ఎల్పుగొండ, గాంధారి 9.3, పుల్కల్ 9.4, బిచ్కుంద 9.6, మాక్దూంపూర్ 9.9, పిట్లం 10°C అత్యంత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News April 13, 2026

ఆసిఫాబాద్: ఆ కళాశాలలో ఒక్కరూ పాస్ కాలేదు..!

image

కాగజ్‌నగర్ మండలం బలగాలలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (TEMREIS) ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. ఈ కళాశాల నుంచి ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేదు. జిల్లావ్యాప్తంగా ‘జీరో రిజల్ట్’ నమోదైన ఏకైక కళాశాలగా ఇది నిలిచింది. అధికారుల పర్యవేక్షణ లోపం, బోధన వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News April 13, 2026

అనకాపల్లి: ప్రేమ పేరుతో మోసం.. CISF కానిస్టేబుల్ అరెస్ట్

image

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన కేసులో CISF కానిస్టేబుల్ కె.రాజీవ్ గాంధీని అరెస్ట్ చేసినట్లు అనకాపల్లి సీఐ ప్రేమ్ కుమార్ ఆదివారం తెలిపారు. చీడికాడ మండలానికి చెందిన కానిస్టేబుల్ చోడవరం మండలానికి చెందిన యువతిని అనకాపల్లిలో తన అక్క ఇంటిలో ఉంచి ఆమెను కలిసేవాడు. పెళ్లి విషయం ప్రస్తావించగా నిరాకరించడంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు యూపీలో పని చేస్తున్న కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశామన్నారు.

News April 13, 2026

మచిలీపట్నం-విజయవాడ హైవేపై ప్రమాదం.. స్పాట్ డెడ్, కారు నుజ్జు

image

మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై ఉయ్యూరు వద్ద ఉన్న జియో పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున పెను ప్రమాదం సంభవించింది. కానూరుకు చెందిన కారు అదుపుతప్పి ప్రమాదానికి గురవడంతో ప్రయాణికుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.