News December 8, 2025
చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని మృతి

TG: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(M) గొల్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సురేందర్ అనే వ్యక్తి నిన్న ఇంట్లో చికెన్ తింటుండగా ఓ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరి ఆడకపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది. ఇటీవల ఉమ్మడి MBNR జిల్లాలో గొంతులో గుడ్డు ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే.
Similar News
News January 13, 2026
ఐఫోన్ యూజర్లకు అలర్ట్

ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. ‘జీరో క్లిక్ స్పైవేర్’ దాడులు జరుగుతున్నట్లు తెలిపింది. లింక్ క్లిక్ చేయకుండానే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 11 నుంచి ఆపై మోడల్స్ ఉపయోగిస్తున్న వారు iOS 26కి వెంటనే అప్‌డేట్ కావాలని సూచించింది. అదనంగా లాక్‌డౌన్ మోడ్ ఆన్ చేయడం, ఫోన్‌ను తరచూ రీబూట్ చేయడం ద్వారా రక్షణ పెరుగుతుందని స్పష్టం చేసింది.
News January 13, 2026
ప్రేక్షకులు లేకుండానే WPL మ్యాచ్‌లు!

WPLలో భాగంగా జనవరి 14, 15 తేదీల్లో జరిగే మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరగనున్నట్లు తెలుస్తోంది. జనవరి 15న ముంబైలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. దీంతో DY పాటిల్ స్టేడియంలో జరిగే DC-UPW, MI-UPW మ్యాచ్‌లకు సరిపడా భద్రత కల్పించలేమని పోలీసులు BCCIకి తెలియజేశారు. ఈ తేదీలకు సంబంధించిన టికెట్లను అమ్మకానికి పెట్టలేదు. 16న జరిగే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు సైతం ప్రస్తుతానికి అందుబాటులో లేవు.
News January 13, 2026
నేటి నుంచి పరేడ్ గ్రౌండ్స్‌లో పతంగుల పండుగ

TG: Hyd పరేడ్ గ్రౌండ్స్‌లో ఈరోజు నుంచి 18వ తేదీ వరకు కైట్ ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుకల్లో 19 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, అలాగే దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ ఫ్లైయర్స్ పాల్గొననున్నారు. పతంగులతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకర్షణగా నిలవనున్నాయి. భద్రత దృష్ట్యా మాంజా దారాన్ని నిషేధించారు. సాధారణ దారంతోనే గాలిపటాలు ఎగురవేయాలని నిర్వాహకులు స్పష్టం చేశారు.


