News December 8, 2025
చౌటుప్పల్: ఉప సర్పంచ్ కుర్చీకి భారీ డిమాండ్

పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవికి డిమాండ్ భారీగా పెరిగింది. దీనికి కారణం జాయింట్ చెక్ పవర్ ఉండటమే. ఈ కుర్చీని దక్కించుకోవడానికి ఆశావహులు వార్డు మెంబర్ స్థానంలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మేజర్ పంచాయతీల్లో ఈ పదవి కోసం ఏకంగా రూ.5 నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. వార్డు సభ్యులను తమవైపు తిప్పుకోవడానికి నగదు ఆఫర్లు, రహస్య ఒప్పందాలు జరుగుతున్నాయనే ప్రచారం స్థానికంగా ఎన్నికల వేడిని రాజేస్తోంది.
Similar News
News January 12, 2026
ధైర్యంగా ఉన్నా.. కుమారుడికి మదురో సందేశం

అమెరికా జైలులో ఉన్న వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో తన కుమారుడు నికోలస్ మదురో గుయెర్రాకు భావోద్వేగ సందేశం పంపారు. తనను కలిసిన లాయర్ల ద్వారా “నేను పోరాట యోధుడిని, ధైర్యంగా ఉన్నా. నా గురించి విచారపడొద్దు” అని తెలిపారు. ఎదుటివాళ్లు ఎంత శక్తిమంతులైనా భయపడొద్దని సూచించారు. తాను క్షేమంగా ఉన్నానని, US నిర్బంధంలోనూ ధైర్యం కోల్పోలేదని చెప్పారు. ఈ విషయాలను గుయెర్రా మీడియాకు వెల్లడించారు.
News January 12, 2026
బీర సాగుకు అనువైన విత్తన రకాలు

బీర పంటలో మంచి దిగుబడి రావాలంటే విత్తన ఎంపిక ముఖ్యం. భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ రూపొందించిన అర్క సుజాత, అర్క ప్రసన్న, అర్క సుమిత్, అర్క విక్రమ్ వంటి రకాలతో పాటు.. సురేఖ, సంజీవని, మహిమ, ఎన్.ఎస్-3(NS-3), ఎన్.ఎస్.401 (NS-401), ఎన్.ఎస్.403 (NS-403), అర్జున్, లతిక, మల్లిక, నాగ వంటి హైబ్రిడ్ రకాలతో మంచి దిగుబడులను సాధించవచ్చు. మీ ప్రాంతాన్ని బట్టి నిపుణుల సూచనలతో వీటిలో రకాలను ఎంపిక చేసుకోవాలి.
News January 12, 2026
కర్కాటకము వర్షిస్తే కాడిమోకు తడవదు

సాధారణంగా కర్కాటక కార్తెలో వర్షాలు చాలా వేగంగా, కుండపోతగా కాకుండా కేవలం తుంపర్లుగా లేదా చాలా తక్కువ సమయంలోనే కురిసి ఆగిపోతుంటాయి. ‘కాడి’ అంటే ఎడ్ల మెడపై వేసే చెక్క, ‘మోకు’ అంటే దానికి కట్టే బలమైన తాడు. కర్కాటక కార్తెలో వర్షం ఎంత తక్కువగా కురుస్తుందంటే, కనీసం పొలంలో పని చేసే ఎడ్ల కాడికి ఉన్న ఆ తాడు కూడా పూర్తిగా తడవనంత తక్కువగా ఉంటుందని దీని అర్థం. ఈ వర్షం వల్ల ప్రయోజనం ఉండదని భావం.


